న్యూఢిల్లీ, తెలుగుప్రభ : కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మంత్రివర్గాల్లో మహిళా ప్రాతినిధ్యంపై భారతీయ జనతా పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మహిళా సాధికారతపై కాంగ్రెస్ చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని ఆరోపించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాంశు త్రివేది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, తెలంగాణలో ఇద్దరు ఉంటే ఒకరిని ఇటీవలే తొలగించారని ఎద్దేవా చేశారు. కేరళతో కలిపి నాలుగు ప్రభుత్వాల్లో కేవలం ముగ్గురే మహిళా మంత్రులు ఉండటం మహిళలకు తీరని అన్యాయం చేయడమేనని త్రివేది విమర్శించారు.
మహిళా రిజర్వేషన్లపై ప్రధానికి లేఖలు రాసే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు తమ సొంత ప్రభుత్వాల్లో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ విశ్వసనీయత లోపానికి నిదర్శనమన్నారు.
Also Read:Krishna Janmashtami: మీ ఇష్ట ప్రకారం జన్మిస్తారు అంటే – మీకు ఎప్పుడు ఇష్టమౌతుంది?

