ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Election Results) బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాలకు గానూ ఇప్పటివరకు 13 స్థానాల్లో విజయం సాధించింది. మరో 35 చోట్ల ఆధిక్యంలో ఉంది. 27 ఏళ్ల విరామం తర్వాత దేశ రాజధానిలో తిరిగి కాషాయ జెండా ఎగరడంతో ఆ పార్టీ కార్యకరతలు సంబరాలు(BJP Celebrations) చేసుకుంటున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు డ్యాన్సులు చేస్తూ టపాసులు కాల్చుకుంటున్నారు.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ 4 చోట్ల విజయం సాధించి 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఆప్ దిగ్గజ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తదితరులు ఓడిపోవడం సంచలనంగా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే డిపాజిట్లు కోల్పోయింది. దీంతో హ్యాట్రిక్ జీరోలతో రికార్డు సృష్టించింది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క స్థానం గెలుచుకోలేదు.