Saturday, November 15, 2025
HomeTop StoriesMaharashtra: కాంగ్రెస్ నేతకు చీర కట్టించిన బీజేపీ కార్యకర్తలు.. అసలేం జరిగిందంటే?

Maharashtra: కాంగ్రెస్ నేతకు చీర కట్టించిన బీజేపీ కార్యకర్తలు.. అసలేం జరిగిందంటే?

BJP vs Congress: మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ నేతకు బీజేపీ కార్యకర్తలు బలవంతంగా చీర కట్టించారు. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఒక వ్యక్తికి ఇలా బలవంతంగా చీర కట్టించడం సరైన పద్ధతి కాదని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ కార్యకర్తలు ఎందుకు అలా చేశారో తెలుసుకుందాం!

- Advertisement -

అసలేం జరిగిందంటే: మహారాష్ట్రలోని డోంబివలి సమీపంలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త ప్రకాష్ మామా పగరేకు ఇటీవల బీజేపీ కార్యకర్తలు బలవంతంగా చీర కట్టించారు. దానికి సబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఇటీవల ప్రకాష్ మామా పగరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిన ఫోటోను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. దీంతో ఈ అంశంపై డోంబివలిలో రాజకీయ దుమారం చెలరేగింది. దీనిపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కళ్యాణ్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నందు పరాబ్ నేతృత్వంలో బీజేపీ కార్యకర్తలు పగారేను అడ్డుకుని ప్రశ్నించారు. ఆయన చర్య దేశ అత్యున్నత నాయకుడిని అవమానించడమే అని ఆరోపించారు. దీనికి ప్రతీకారంగా.. బీజేపీ కార్యకర్తలు పగారేకు చీర కట్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి ప్రయత్నాలు మళ్లీ జరిగితే బీజేపీ మరింత తీవ్రంగా స్పందిస్తుందని పరాబ్ హెచ్చరించారు.

తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ: బీజేపీ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. 73 ఏళ్ల వృద్ధుడిపై బీజేపీ కార్యకర్తలు ఇలా వ్యవహరించడం సరికాదని కళ్యాణ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సచిన్ పోటే అన్నారు. పగారే ఏదైనా తప్పు చేసి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండేనని అన్నారు. ఇలా బీజేపీ కార్యకర్తలు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడమేంటని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలు ఇలా ఒక వ్యక్తికి బలవంతంగా చీర కట్టించడం సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. ఈ అంశంపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకులపై కూడా బీజేపీ మద్దతుదారులు తరచుగా అభ్యంతరకరమైన పోస్టులు పెడతారని సచిన్ పోటే అన్నారు. కానీ తాము ఇలాంటి పద్ధతులను అనుసరించలేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా స్పందిస్తారో ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad