Friday, November 22, 2024
Homeనేషనల్BJY: ఎట్టకేలకు జాకెట్ వేసుకున్న రాహుల్ .. పాదయాత్రలో తొలిసారి ఇలా..

BJY: ఎట్టకేలకు జాకెట్ వేసుకున్న రాహుల్ .. పాదయాత్రలో తొలిసారి ఇలా..

జస్ట్ ఓ వైట్ టీ షర్ట్ తో ఇంతకాలం కనిపించిన రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి జాకెట్ వేసుకుని కనిపించారు. తనకు చలి పెడితే తప్ప జాకెట్, స్వెట్టర్ వేసుకోనంటూ గజగజ వణికించే చలిలో కూడా ఆయన గత కొన్ని రోజులుగా పాదయాత్ర చేపట్టారు.

- Advertisement -

ఇప్పటి వరకూ 3,400 కిలోమీటర్లు 125 రోజులపాటు సాగిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్ చాలా సింపుల్ గా కనిపిస్తూ వచ్చారు. ఆయన వేసుకున్న టీ షర్ట్ ధర చాలా ఎక్కువనే వార్తలు వచ్చినా చలిలోనూ ఆయన స్వెట్టర్ వేసుకోకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పంజాబ్ నుంచి జమ్మూలోకి అడుగు పెట్టిన రాహుల్ ఇక్కడి చిలికి జాకెట్ వేసుకోక తప్పలేదు. జమ్మూలో ఈ ఉదయం నుంచి జల్లులు కురుస్తున్నాయి. 52 ఏళ్ల కాంగ్రెస్ ఎంపీ ఇలా కాసేపు జాకెట్ వేసుకుని ఆతరువాత తీసేసి పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జమ్ము-కశ్మీర్ లో రాహుల్ కు మరింత రక్షణ కల్పించేలా పోలీసులు, పారామిలిటరీ బలగాలు ఆయనకు రక్షణ వలయంలా ఉండి, పాదయాత్రలోకి ఎవరిని పడితే వారిని అనుమతించకుండా భద్రతా వలయాన్ని పటిష్టం చేశారు. జామర్స్ ను కూడా పెట్టారు. కశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో కాలి నడకన వెళ్లద్దంటూ భద్రతా బలగాలు రాహుల్ ను ఇప్పటికే హెచ్చరించాయి కూడా. ఈనేపథ్యంలో భారత్ జోడో యాత్రలో కొన్ని మార్పులు చేస్తూ, పాదయాత్రను కుదిస్తున్నారుకూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News