Thursday, December 5, 2024
Homeనేషనల్Rahul Gandhi: నన్ను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం: రాహుల్ గాంధీ

Rahul Gandhi: నన్ను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం: రాహుల్ గాంధీ

Rahul Gandhi| ఇటీవల ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని సంభల్‌(Sambhal)లో మతపరమైన హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీPriyanka Gandhiలు సంభల్ బయలుదేరారు. అయితే వారిని ఘాజీపుర్‌ సరిహద్దు(Ghazipur border) వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఘాజీపుర్‌ సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

- Advertisement -

పోలీసులు అడ్డుకోవడంపై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంభల్‌ వెళ్లాలనుకుంటే పోలీసులు తమను అనుమతించట్లేదని మండిపడ్డారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన తనకు అక్కడకు వెళ్లే హక్కు ఉందన్నారు. ఇతర నేతలతో కాకుండా పోలీసులతో కలిసి ఒంటరిగా వెళ్లేందుకూ తాను సిద్ధమే అన్నారు. కానీ ఇలా బలవంతంగా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని రాహుల్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందని ధ్వజమెత్తారు. సంభల్ బాధితుల తరపున తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇక వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. బాధితులను కలిసే హక్కు ఆయనకు ఉందని నిలదీశారు. అయితే పోలీసులు ఎంతసేపటికీ అనుమతించకపోవడంతో వారు తిరిగి ఢిల్లీ బయలుదేరారు.

కాగా ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌ జిల్లాలో ఓ మసీదు ఉన్న స్థానంలో ఆలయం ఉందని కొందరు గతంలో ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సర్వేకు ఆదేశాలు ఇచ్చింది. ఆ సర్వే జరుగుతోన్న సమయంలోనే అల్లర్లు చెలరేగాయి. ఆ ఘర్షణల్లో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News