Monday, December 9, 2024
Homeనేషనల్Delhi | ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం

Delhi | ఢిల్లీలో బాంబు పేలుడు కలకలం

ఢిల్లీ (Delhi)లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నిత్యం రద్దీగా ఉండే ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని ఓ స్వీట్ షాప్ వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.

- Advertisement -

గురువారం ఉదయం 11.48 గంటలకు పేలుడు జరగడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో చుట్టుపక్కల వారు పరుగులు పెట్టారు. పేలుడు జరిగిన ప్రాంతంలో తెల్లని పౌడర్‌ ను పోలీసులు గుర్తించారు. బ్లాస్ట్ కి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడుతో ప్రాణ నష్టం జరగలేదని, ఆ ప్రాంతంలో ఆటో పార్క్ చేసిన డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు వివరించారు. పేలుడు జరిగిన తర్వాత ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News