Saturday, November 15, 2025
HomeTop StoriesDelhi Bomb Blast: ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 8 మంది మృతి

Delhi Bomb Blast: ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 8 మంది మృతి

Bomb Blast At Red Fort Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ సమీపంలోని ఓ కారులో భారీ పేలుడు జరిగింది. ఘటనలో 8 మంది మృతి చెందారు. 24 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. పలు వాహనాలు మంటల్లో అగ్నికి ఆహుతయ్యాయి. క్షతగాత్రులను ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడు ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

- Advertisement -

సోమవారం సాయంత్రం 6.55 గంటలకు పేలుడు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ఎర్రకోట గేట్‌ నెంబర్ 1 సమీపంలోని మెట్రో స్టేషన్‌ పార్కింగ్‌ ప్లేసులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం మేరకు పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏడు అగ్నిమాపక వాహనాలు, బాంబు స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్‌ ప్రకటించారు. 

ప్రమాదం అనంతరం స్థానికంగా భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం, క్లూస్‌ టీం సంఘటనా స్థలికి చేరుకున్నాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను ఎవరైనా రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పేల్చి ఉంటారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి వివరాలు వెల్లడించారు. ఆ సమయంలో తాను గురుద్వారా వద్ద ఉన్నానని.. భారీ శబ్ధం వినిపించిందని.. అయితే అదేంటో తమకు అర్థం కాలేదన్నారు. కారుతో పాటు సమీపంలోని వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని వివరించారు. ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కారణంగా ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad