Sunday, February 8, 2026
Homeనేషనల్IndiGo: ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

IndiGo: ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

IndiGo Flight Bomb Threatening: ఇండిగో విమానానికి ఆదివారం బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీంతో విమానం గమ్యస్థానానికి చేరుకోకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది.

- Advertisement -

ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రాకు వెళ్తున్న ఇండిగో విమానం (6E-6650) ఆదివారం బాంబు బెదిరింపు ఎదుర్కొంది. దీంత లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ అయింది. ఇండిగో విమానంలోని టాయిలెట్‌లో ఒక టిష్యూ పేపర్‌పై “విమానంలో బాంబు ఉంది” అని హిందీలో రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించి వెంటనే పైలట్‌కి సమాచారం అందించింది.

Also Read: https://teluguprabha.net/crime-news/up-man-killed-his-room-mate-for-22-rupees-in-medak-district/

దీంతో విమానంలో 8 మంది చిన్నారులతో సహా 222 మంది ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 238 మంది ఉన్నారు. ఆదివారం ఉదయం 8:46 గం.కు బెదిరింపు సమాచారం అందడంతో పైలట్లు లఖ్‌నవూ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కి సమాచారం అందించి ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం అభ్యర్థించారు. దీంతో ఉదయం 9:17 గంటలకు విమానం లక్నోలో సురక్షితంగా ల్యాండింగ్‌ అయింది. వెంటనే సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ బృందాలు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి.

Also Read: https://teluguprabha.net/devotional-news/vasant-panchami-2026-saraswati-puja-memory-education-benefits/

ప్రయాణికులందరినీ సురక్షితంగా ఖాళీ చేయించారు. ప్రాథమిక తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. ఈ బాంబు బెదిరింపు ఎవరు చేశారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. విమానాన్ని టర్మినల్‌ ప్రాంతంలో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News