Thursday, December 19, 2024
Homeనేరాలు-ఘోరాలుRBI: ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపులు

RBI: ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపులు

RBI| దేశంలో బాంబు బెదిరింపులు ఆగడం లేదు. మొన్నటి వరకు విమానాశ్రయాలతో పాటు విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు(Bomb threats) వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. భవనాన్ని పేల్చివేస్తామంటూ రష్యన్‌ భాషలో దుండగులు ఈ మెయిల్‌ పంపించారు. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెదిరింపులకు పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులపై మాతా రమాబాయి మార్గ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

- Advertisement -

దీంతో ఆర్బీఐ కార్యాలయం చుట్టూ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కాగా ఈ ఏడాది నవంబర్‌ 16న ఆర్‌బీఐకి కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News