కర్నాటక సరిహద్దు జిల్లాల్లో 45 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశాసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ఈనెల 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్ననేపధ్యంలో అక్రమ మద్యం,డబ్బు వంటివి అక్రమ రవాణా చేయకుండా నియంత్రించేందుకు మొత్తం 45 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కు వివరించారు. ఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సహచర కమీషనర్లు గోయల్, పాండేలతో కలిసి కర్నాటక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన కర్నాటక సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా,మహారాష్ట్ర,గోవా,కేరళ,తమిళనాడు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ,డిజిపి,సిఇఓ ఇతర సీనియర్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ కర్నాటక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన జిల్లాల్లో పోలీస్,ఎక్సైజ్,వాణిజ్య పన్నులు,రెవెన్యూ తదితర విభాగాల అధికారులు, సిబ్బందితో కూడిన 45 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు విషయాన్ని తెలిపారు. ఆయా చెక్ పోస్టుల ద్వారా ఇప్పటి వరకూ 3వేల 8 లీటర్ల అక్రమ ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ ను, ఒక్కొక్కటి 90 మిల్లీ లీటర్లు కలిగిన 444 టెట్రా ఫ్యాక్ లను,రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కెవి.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ మద్యం,నగదు రవాణా చేయకుండా ఆయా చెక్ పోస్టులలో నిరంతరం నిఘా పెట్టామని తెలిపారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ రానున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా అక్రమ మద్యం,నగదు రవాణా కాకుండా సరిహద్దు రాష్ట్రాల చెక్ పోస్టులు ద్వారా నిరంతర నిఘాపెట్టి విస్తృతమైన తనిఖీలు చేపట్టాలని ఆయా రాష్ట్రాల సిఎస్,డిజిపిలను ఆదేశించారు.అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా చెక్ పోస్టుల్లో కట్టిదిట్టమైన నిఘా పెట్టాలని ఆదేశించారు.మహిళలు,యువత భాగస్వామ్యంతో ఓటింగ్ శాతం పెరిగేలా చూడడంతో పాటు హింసాత్మక సంఘటనలకు ఆస్కారం లేని విధంగా రీపోల్ అవకాశం లేని రీతిలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని సిఇసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇంకా ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా,ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ,హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరిష్ కుమార్ గుప్త,గ్రేహాండ్స్ అదనపు డిజిపి ఆర్కె మీనా,ఎస్ఇబి డైరెక్టర్ యం.రవి ప్రకాశ్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Borders: కర్నాటక సరిహద్దు జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES