Friday, September 20, 2024
Homeనేషనల్Groom kisse Bride :పెళ్లిపీట‌ల‌పై ముద్దు పెట్టాడ‌ని.. వ‌ధువు ఏం చేసిందంటే..?

Groom kisse Bride :పెళ్లిపీట‌ల‌పై ముద్దు పెట్టాడ‌ని.. వ‌ధువు ఏం చేసిందంటే..?

Groom kisse Bride : పెళ్లి అవుతుంద‌న్న ఆనందంలో వ‌రుడు చేసిన ఓ కొంటె ప‌ని అత‌డి కొంప ముంచింది. పెళ్లిపీట‌ల‌పై ముద్దు పెట్టాడ‌ని వ‌ధువు అత‌డిని పెళ్లి చేసుకునేందుకు నిరాక‌రించింది. దీంతో ఇరు కుటుంబాల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. చివ‌ర‌కు ఆ పంచాయ‌తీ పోలీసుల వ‌ర‌కు వెళ్లింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని సంభ‌ల్ జిల్లాలో జ‌రిగింది.

- Advertisement -

బహ్జోయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్లీ గ్రామానికి చెందిన ఓ యువ‌కుడికి, సంభ‌ల్ జిల్లా ప‌వాస‌కు చెందిన ఓ యువ‌తితో పెళ్లి చేసేందుకు పెద్ద‌లు నిర్ణ‌యించారు. న‌వంబ‌ర్ 26న ఇద్ద‌రికి వివాహాన్ని జ‌రిపించారు. అయితే.. దండ‌లు మార్చుకున్న త‌రువాత వ‌ధువుకు వ‌రుడు ముద్దు పెట్టాడు. ఈ ఘ‌ట‌న వ‌ధువుకు కోపం తెప్పించింది. వెంట‌నే పెళ్లిపీట‌ల పై నుంచి లేచి వెళ్లిపోయింది. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ పంచాయ‌తీ పోలీస్ స్టేష‌న్‌కు చేరింది.

దాదాపు 300 మంది చూస్తుండ‌గా వ‌రుడు త‌న‌కు ముద్దు పెట్టాడ‌ని వ‌ధువు చెప్పింది. అత‌డి తీరు బాగాలేద‌ని, త‌న‌కు భ‌ర్త‌గా అత‌డు వ‌ద్దని స్ప‌ష్టం చేసింది. పోలీసులు స‌ర్దిచెప్పిన‌ప్ప‌టికీ వ‌ధువు విన‌లేదు. వ‌రుడితో వెళ్లేందుకు నిరాక‌రించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News