Friday, November 22, 2024
Homeనేషనల్Bihar Bridge Collapse : ప్రారంభానికి ముందే కూలిన వంతెన‌.. ప్ర‌జాధ‌నం నీళ్ల‌పాలు

Bihar Bridge Collapse : ప్రారంభానికి ముందే కూలిన వంతెన‌.. ప్ర‌జాధ‌నం నీళ్ల‌పాలు

Bihar Bridge Collapse : ప్రారంభానికి ముందే ఓ వంతెన కుప్ప‌కూలింది. దీంతో కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం నీళ్ల పాలైంది. ఈ ఘ‌ట‌న బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బెగుసరాయ్‌లోని గండ‌క్ న‌దిపై 206 మీట‌ర్ల పొడ‌వైన వంతెన‌ను 13 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఆదివారం వంతెన ముందుభాగం కూలి న‌దిలో ప‌డిపోయింది.

- Advertisement -

ముఖ్యమంత్రి నాబార్డు పథకం కింద సాహెబ్‌పూర్ కమల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహోక్ గండక్ ఘాట్ వైపు నుండి ఆకృతి తోలా చౌకీ, బిషన్‌పూర్ మధ్య వంతెనను నిర్మించారు. 2016లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభి 2017లో పూర్తి చేశారు. అయితే అప్రోచ్ రోడ్డు లేక‌పోవ‌డంతో లేకపోవడంతో ప్రారంభోత్సవం జరగలేదు. అప్పుడ‌ప్పుడు ట్రాక్ట‌ర్లు, భారీ వాహ‌నాలు వంతెన మీదుగా వెలుతున్నాయి.

దీంతో 2, 3 పిల్లర్ల మ‌ధ్య భాగంలో ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి. వంతెన పగుళ్లపై స్థానికులు అధికారులకు లేఖ రాశారు. అధికారులు చ‌ర్య‌లు తీసుకునే లోపే వంతెన కూలిపోయింది. అయితే.. అదృష్ట‌వ‌శాత్తు ఈ ఘ‌ట‌న‌లో ఎవ్వ‌రికి ఎటువంటి ప్ర‌మాదం సంభ‌వించ‌లేదు.

వంతెన నిర్మించిన కాంట్రాక్ట‌ర్‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌జ‌న‌శ‌క్తా పార్టీ నేత సంజ‌య్ యాద‌వ్ మాట్లాడుతూ.. ఈ వంతెన నిర్మాణంలో భారీ దోపిడీలు జ‌రిగాయి. వంతెన ప్రారంభోత్స‌వానికి ముందే న‌దిలో మునిపోవ‌డ‌మే ఇందుకు సాక్ష్యం. వంతెన నిర్మించిన ఏజెన్సీ కాంట్రాక్ట‌ర్‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News