Saturday, November 23, 2024
Homeనేషనల్BRS: అందరి కళ్లూ హిమాన్షుపైనే, ఇంతకీ ఎవరీ హిమాన్షు?

BRS: అందరి కళ్లూ హిమాన్షుపైనే, ఇంతకీ ఎవరీ హిమాన్షు?

31 ఏళ్ల యువకుడి బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా పగ్గాలు అప్పగించారు కేసీఆర్. హిమాన్షు తివారి వయసు 31 ఏళ్లు. వారణాసిలో కంప్యూటర్స్ లో మాస్టర్స్ పూర్తి చేసిన హిమాన్షు స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందినవారు. ఉత్తర్ ప్రదేశ్ లోని జాన్ పూర్ ఈయన స్వస్థలం. 2015 నుంచి హిమాన్షు జాతీయ స్థాయిలో రైతుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ ఆర్డినెన్స్ పై ఆయన దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. రైతుల ఉద్యమంలో ఆయన జాతీయస్థాయిలో సమన్వయం చేస్తున్నారు. యునైటెడ్ కిసాన్ మోర్చా నేషనల్ లో ఆయన సభ్యుడు. ఎస్కేఎం నేషనల్ ఎగ్జిక్యుటివ్ లో 2020-2021 ఆయన కీలక సభ్యుడిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కు తీసుకునేలా ఒత్తిడి తేవటంలో సఫలీకృతం అయ్యారు. బిహార్ లోని చంపారన్ నుంచి బెనారస్ వరకు 21 రోజుల పాదయాత్రను హిమాన్షు చేపట్టారు. ఇందులో భాగంగా వేలాదిమందితో జన్ జాగరణ్ యాత్ర నిర్వహించారు. ప్రస్తుతం కేసీఆర్ టీంలో ఈయన సభ్యుడిగా మారారు. బీఆర్ఎస్ నేషనల్ జనరల్ సెక్రెటరీగా భారత రాష్ట్ర సమితి పార్టీకి హిమాన్షు సేవలు అందించనున్నారు. బీఆర్ఎస్ నేషనల్ జనరల్ సెక్రెటరీగా హిమాన్షు నియమితులు కావటంలో ఇప్పుడు అందరి కళ్లూ ఈయనమీదే ఉన్నాయి.

- Advertisement -

ఉద్యమాల్లో అనుభవం ఉన్న ఉడుకు రక్తం, యువకుడైన పోరాట యోధుడు, ఇప్పటికే రైతు ఉద్యమాల్లో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినవాడు, ఉత్తరాది బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హిమాన్షుకు ఇంత చిన్న వయసులోనే అపర చాణక్యుడైన కేసీఆర్ పార్టీ పగ్గాలు అప్పగించారంటే ఇక ఈ కుర్రాడి ట్రాక్ రికార్డు గొప్పగా ఉన్నట్టేనని రాజకీయ పండితులు సైతం హిమాన్షుపై భారీ అంచనాలు పెట్టకోవటం స్టార్ట్ చేసేశారు. ఇక వారణాసికి చెందిన యువకుడుని ఇలా ఎంచుకోవటంతో మోడీ సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ పట్టు పెంచుకునే వ్యూహం షురూ చేసినట్టే భావించవచ్చు.

యువకులకు బీఆర్ఎస్ లో సముచిత స్థానం దక్కుతుందనే భరోసా కూడా నోటితో చెప్పకుండానే కేసీఆర్ ఇస్తున్నట్టు దీన్నిబట్టి స్పష్టం అవుతోంది. మూడు పదుల వయసులోనే పాదయాత్ర, రైతు ఉద్యమాలపై విశాలమైన అనుభవాన్ని సంపాదించిన హిమాన్షు ఉత్తరాదిలో గేమ్ ఛేంజర్ గా ఎదుగుతారా? యూపీలో గులాబీ జెండా బలంగా నాటుతారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

All
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News