HomeTop StoriesNEET: 'నీట్‌ పరీక్ష రద్దు.. విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం'- రాహుల్‌ గాంధీ

NEET: ‘నీట్‌ పరీక్ష రద్దు.. విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం’- రాహుల్‌ గాంధీ

NEET Paper Leakage: ప్రశ్నాపత్రం లీక్‌ ఆరోపణల నేపథ్యంలో నీట్‌ యూజీ-2026 పరీక్షను NTA రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 3న జరిగిన నీట్‌ యూజీ పరీక్ష రద్దు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నీట్‌ పరీక్ష లీక్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. కాగా, పరీక్ష రద్దుపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి ఇలా పరీక్ష రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు.  

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/big-shock-for-non-veg-lovers/

నీట్‌ పరీక్ష రద్దుపై స్పందించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 22 లక్షల విద్యార్థుల కలలు చిన్నాభిన్నం అయ్యాయని.. వారి కఠోర శ్రమ, త్యాగాలు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు తల్లిదండ్రులు తమ నగలు అమ్మి పిల్లలను చదివించారని.. రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష రాస్తే వారికి లభించిన ప్రతిఫలం ఇదేనా.? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి వల్లే ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యిందని ఆరోపించారు. 

‘ఇది కేవలం పరీక్షా నిర్వహణ వైఫల్యం కాదు. యువత భవిష్యత్తుతో ఆడుకునే “నేరం”. బీజేపీ ప్రభుత్వంలో పేపర్ లీక్ మాఫియా రాజ్యమేలుతోంది. 22 లక్షల మంది విద్యార్థుల కష్టం, ఆశలు బూడిదయ్యాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేపర్ లీక్‌లు, అవినీతి విపరీతంగా పెరిగాయి. బీజేపీ హయాంలో ఇది “అమృత్ కాలం” కాదు. విషపూరితమైన కాలం. ఈ అంశంపై పార్లమెంట్‌లో గళమెత్తుతా. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదు.’- రాహుల్‌ గాంధీ

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష రద్దుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం, రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం వల్లే ప్రశ్నాపత్రం లీకేజీ అయిందని ఆరోపించారు. పారదర్శకంగా పరీక్షను నిర్వహించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి పేపర్ లీక్ చేసే వారికి దేశంలో చోటు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఏ పరీక్షా సక్రమంగా జరగడం లేదని, మెడికల్ సీట్ల కోసం విద్యార్థుల కష్టాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ పరిణామాలకు వారు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Also Read: https://teluguprabha.net/telangana/kcr-serious-warning-to-brs-leaders/

నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు చేటని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడిందని మండిపడ్డారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైందని ఎద్దేవా చేశారు. 2024లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైందని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

‘నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పరీక్షలంటేనే విద్యార్థులు భయపడే పరిస్థితి వచ్చింది. పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతున్నాయి. పేపర్ లీకేజీల వెనుక పెద్ద స్కాం ఉంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఎన్‌టీఏను రద్దు చేయాలి.’- కేటీఆర్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News