Sunday, October 6, 2024
Homeనేషనల్BRS Maharashtra: బిఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు

BRS Maharashtra: బిఆర్ఎస్ లోకి కొనసాగుతున్న వలసలు

వీరి చేరిక ప్రాధాన్యతను సంతరించుకుంది

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మరాఠా మాజీ ఎంపీ సంగ్రామ్ సింగ్ జై సింగ్ రావు గైక్వాడ్ తన అనుచరులతో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. వీరి చేరిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. అదే సందర్భంలో .. ప్రముఖ వ్యాపారవేత్త సుగర్ ఫ్యాక్టరీల యజమాని, మరాఠా ధన్ కర్ సమాజిక వర్గంలో మంచి పట్టున్న నేత బాలాసాహెబ్ కన్నంవార్ బిఆర్ఎస్ లో అధినేత సమక్షంలో చేరారు. బాలాసాహెబ్ చేరిక ప్రాధాన్యతను సంతరించుకున్నది.

- Advertisement -

వీరితో పాటు మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా నుంచి పలువులు ముఖ్యనేతలు పార్టీ లో చేరారు. వీరందరికి అధినేత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో కిసాన్ ఉద్యమ నేత కిషన్ హరిశ్చంద్ర కశిద్, శివసేన అధ్యక్షుడు ప్రాగ్ శామ్ రావ్ పాటిల్, జిల్లా అధ్యక్షుడు పుండలీక్ కృష్ణాజీ జాదవ్, నితా శ్యామ్ రావ్ గైక్వాడ్, జిల్లా ఆరెస్పీ అధ్యక్షుడు ఓకార్ నాన్సో నికమ్, కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు విశ్వజిత్ షిండే, ప్రొ.శరద్ కాంబ్లే , మహిళానేత స్వప్నమాలి, ఆరెస్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్, మాణిక్ పోలా, యువనేత సచిన్ అంబోర్, కార్మిక నేత సలీం భైవా సయ్యద్, చత్రపతి సేన రాష్ట్ర అధ్యక్షుడు రోహిత్ బాహూ మాల్మే, ఆర్ఎస్పీ సాంగ్లీ జిల్లా అధ్యక్షుడు ఆకాశ్ పడోలే, వివేక్ పాటిల్ తదితరులు పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంచార్జీ కల్వకుంట్ల వంశీధర్ రావు, మహారాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు శంకరన్న ధోంగే, పూనే డివిజన్ కోఆర్డినేట్ బిజె దేశ్ ముఖ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News