Sunday, July 7, 2024
Homeనేషనల్BRS Maharashtra wing: షాక్ లో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు

BRS Maharashtra wing: షాక్ లో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు

ప్రగతి బాటలో పయనిస్తూ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులంతా, ఆ ప్రగతి ఫలాలు ప్రజలకు అందుతున్న తీరును  కళ్ళారా చూసేందుకు పర్యటనలు చేపడుతున్నారు.  తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తీరుతెన్నులను తెలుసుకునేందుకు, వీటి అమలుతో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు, వ్యవస్థీకృత మార్పులను స్వయంగా చూసే ఉద్దేశంతో ఈ మధ్యే బిఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు తెలంగాణలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  పర్యటన చేపట్టారు. మహారాష్ట్ర బిఆర్ఎస్ ఇంచార్జ్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో సమాలోచనలు జరిపి రంగాలవారీగా అభివృద్ధి తీరుతెన్నులను తెలుసుకునే దిశగా పర్యటన ప్రాంతాలను ఖరారు చేసుకొని యాత్రను కొనసాగించారు. పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ప్రజలకు అందుతున్న ప్రగతి ఫలాలను చూసి మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

- Advertisement -

మహారాష్ట్రకు చెందిన ఎన్సీపి ఔరంగాబాద్ జిల్లా అధ్యక్షుడు సునీల్ సోలంకే,   శివ్ సంగ్రామ్ పార్టీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు నాందేడ్ జిల్లా ఉమేష్ పాటిల్, శివ సంగ్రామ్ పార్టీ బీడ్  జిల్లా అధ్యక్షుడు గజానంద్ తొరాత్, అంబె జొగాయి తాలుకా తహశిల్ ప్రెసిడెంట్ అనిల్ అడుసుల్, ముసా దేశాయ్ – చావా  (నాందేడ్ జిల్లా అధ్యక్షుడు), లాథూర్ జిల్లా  మాజీ జడ్పి మెంబర్ దేవానంద్ ములే,సుశీల్ గోఠె (ఆహ్మద్ పూర్) శివ్ లింగ్ శివచాలి మహరాష్ట్ర ట్రస్ట్ స్టేట్ సెక్రటరీ,  సంతోష్ కచ్రే – ఏక్ నాథ్ షిండే మాజీ పర్సనల్ సెక్రటరీ,  సైలేష్ సర్కటే – శివ సంగ్రామ్ ప్రదేశ్ ప్రెసిడెంట్ మహరాష్ట్ర స్టేట్,  నగేష్ కంబ్లే – శివ సంగ్రామ్ తాలుకా ప్రెసిడెంట్ ముఖెడ్, బాపు సాహెబ్ దేశ్ ముఖ్- శివ సంగ్రామ్ జిల్లా అధ్యక్షుడు  – బుల్ఢానా, శివాజీ పాటిల్ – మాజీ జడ్పి మెంబర్ – బుల్డానా, జ్ఞానేశ్వర్ జగ్దాలే – మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన లాథూర్ జిల్లా అధ్యక్షుడు తదితరుల  బృందం ఈ పర్యటన చేపట్టి క్షేత్రస్థాయిలో అమలవుతున్న పలు పథకాలు, కార్యక్రమాలతో ప్రజలకు అందుతున్న ఫలాలను స్వయంగా చూశారు. ఈ పర్యటనలో వీరి వెంట బిఆర్ఎస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు.

మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకుల పర్యటన సాగిన తీరు:

మొదట సిద్దిపేట జిల్లా సింగయిపల్లి ఫారెస్ట్ ను సందర్శించిన  మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం  కంటి వెలుగు పథకం కింద ఉచితంగా కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ జరుగుతున్న తీరును పరిశీలించి ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధిని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యానికి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలుసుకొని గొప్ప సంతృప్తిని వ్యక్తం చేశారు.  అటు తర్వాత సిద్దిపేట జిల్లా  గజ్వేల్ టౌన్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పరిశీలించి తెలంగాణ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్వహిస్తున్న తీరు పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టిని ప్రశంసించారు. గజ్వేల్ లోని కోమటిబండలో మిషన్ భగీరథ ప్రాజెక్టును పరిశీలించడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా జరిగే తీరును అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం  ఆదర్శంగా తీసుకున్న తీరును వారు ప్రస్తావించారు. ఇలా పలు సంక్షేమ-అభివృద్ధి ఫలాలను వారు స్వయంగా చూశారు. 

తెలంగాణలో క్షేత్రస్థాయిలో పర్యటన సాగిన తీరు పట్ల మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు సంతృప్తిని వ్యక్తం చేశారు. పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్న తీరు పట్ల అధికారులు అవగాహన కల్పించిన తీరును ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలను, నమోదు చేస్తున్న ప్రగతిని మహారాష్ట్ర వ్యాప్తంగా చాటనున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News