Sunday, July 7, 2024
Homeనేషనల్BRS Maharastra: మహారాష్ట్రలో బీఆర్ఎస్ మరింత బలోపేతం

BRS Maharastra: మహారాష్ట్రలో బీఆర్ఎస్ మరింత బలోపేతం

పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూనే ఉన్నాయి

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కి బార్..కిసాన్ సర్కార్’ అనే నినాదంతో దేశంలో కిసాన్ ప్రభుత్వ ఏర్పాటు కోసం నడుం బిగించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ మహారాష్ట్రలో రోజురోజుకూ బలోపేతం అవుతున్నది. పార్టీలోకి మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల రాజకీయ నేతలు, పలు మార్కెట్ కమిటీలు, సహకార బ్యాంకుల మాజీ ఛైర్మన్లు, మాజీ వైస్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, అడ్వకేట్లు, ఛార్టెడ్ అకౌంటెంట్లు సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిలో.. మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లా శ్రీరాంపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే భానుదాస్ కాశీనాథ్ ముర్కుటే చేరారు. ప్రజాదరణ కలిగిన వీరి చేరిక ప్రాధాన్యతను సంతరించుకున్నది. ముర్కుటే ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరు ప్రముఖ అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ యజమాని అంతేకాకుండా అహ్మద్ నగర్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు డైరక్టర్ కూడా. వీరితో పాటు… అశోక్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ వైస్ చైర్మన్ పుంజహరి తుకారాం షిండే, అశోక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీరాంపూర్ అడ్వకేట్ సుభాష్ సకహరి చౌదరి, అశోక్ కో. ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ & లోక్‌సేవా వికాస్ అఘాడి అధ్యక్షుడు శ్రీరాంపూర్ హిమ్మత్రావ్ మాధవరావు ధుమాల్, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ కొందిరామ్ బాబాజీ ఉండే, అశోక్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ మాజీ ఛైర్మన్ సురేష్ మచింద్ర గలాండే, అశోక్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ మాజీ చైర్మన్ దిగంబర్ సర్జేరావ్ షిండే, అశోక్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ మాజీ వైస్ చైర్మన్ బాబాసాహెబ్ పారాజీ కాలే, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ ద్న్యాండియో మోహన్ సలుంకే, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ భౌసాహెబ్ ధోందీరామ్ ఉండే, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ బాబాసాహెబ్ కడూజీ ఆదిక్, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ ఆదినాథ్ నివృత్తి జూరాలే, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ మాజీ వైస్ చైర్మన్ దత్తాత్రే నాయక్, మార్కెట్ కమిటీ శ్రీరాంపూర్ డైరెక్టర్ దశరథ్ విఠోబా పిస్, రాహురి కో.ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్, రమేష్ నానాసాహెబ్ వారే, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ రాంభౌ తులషీరామ్ కాసర్, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ బాబాసాహెబ్ కాలే, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ వీరేష్ భౌసాహెబ్ గలాండే, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ యశ్వంత్ గోవింద్ బంకర్, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ యశ్వంత్ దినకర్ రానానవారే, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ అబాసాహెబ్ బాబాసాహెబ్ గవారే, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ భికాజీ షిండే, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ యోగేష్ భౌసాహెబ్ విటానార్, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ అచ్యుత్రావ్ గులాబ్రావ్ బదఖ్, అశోక్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్ డైరెక్టర్ అమోల్ బాలాసాహెబ్ కోకనే, అశోక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ శ్రీరాంపూర్ డైరెక్టర్ నివృత్తి భగవత్ థోరత్, అశోక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ శ్రీరాంపూర్ డైరెక్టర్ అడ్వకేట్ ఉమేష్ లాటిమేల్, అశోక్ కో ఆపరేటివ్ బ్యాంక్ శ్రీరాంపూర్ డైరెక్టర్ రంజిత్ బంకర్, అశోక్ కో-ఆపరేటివ్ బ్యాంక్ శ్రీరాంపూర్ డైరెక్టర్ జితేంద్ర అశోక్ తోరణే, మార్కెట్ కమిటీ శ్రీరాంపూర్ డైరెక్టర్ కిషోర్ షమ్రావ్ బన్సోడ్, కరేగావ్ షుగర్ కేన్ ట్రాన్‌్ంపోర్ట్ కంపెనీ చైర్మన్ హరిదాస్ దాదా వేటల్, కరేగావ్ షుగర్ కేన్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ వైస్ చైర్మన్ శివాజీ ముతే, లోక్సేవ వికాస్ అఘాడి శ్రీరాంపూర్ యూత్ ప్రెసిడెంట్ గణేష్ విశ్వనాథ్ భాకరే తదితరులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన మరాఠా నేతలు ‘అబ్ కి కిసాన్ సర్కార్’ అనే నినాదాలను చేస్తూ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ప్రజల జీవితాల్లో సంపూర్ణ క్రాంతి రావాలంటే ‘కిసాన్ సర్కార్’ తో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వాలకు బాసులు ప్రజలేనని.. రైతులు, ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారన్నారు. ఆ ప్రభుత్వాలను మనమే ఏర్పాటు చేసుకుందామని, ఇదే విధానంతో మనం అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని ఇచ్చామని సిఎం స్పష్టం చేశారు. దేశ పరిపాలనా దృక్పథంలో గుణాత్మకమైన మార్పు రావాలని పాలకుల వైఖరుల్లో మార్పు రానంత వరకూ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ఆయా ప్రాంతాలకు, రాష్ట్రాలకు అనుగుణంగా దేశ పాలకులు నిర్ణయాలు తీసుకోనంత వరకూ అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ప్రజలకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కష్టపడి విధానాలు రూపొందించామని వివరించారు. కాళేశ్వరం ఫలితాలు అందుకుంటున్నదని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా నిర్మాణం చేస్తున్నామని, త్వరలో అది కూడా పూర్తవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు, తెలంగాణావ్యాప్తంగా ప్రాజెక్టులన్నీ పూర్తయి, ఇప్పటికే పండుతున్న పంటలు అధిక సంఖ్యలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని, పండిన పంటను ఫుడ్ ప్రాసెసింగ్ చేసి దేశ విదేశాలకు మార్కెటింగ్ చేసి రైతులకు మరింత లాభాలను అందిస్తామని సీఎం కేసీఆర్ మహారాష్ట్ర నేతలకు వివరించారు. ఇదే విధానం మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా అమలు చేస్తామని, దేశ రైతు సంక్షేమం కోసమే బిఆర్ఎస్ కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు.

అనంతరం.. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించుకొని వచ్చిన మహారాష్ట్ర నేతలను సీఎం కేసీఆర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనితీరునంతా తాము పరిశీలించామని, ఇటువంటి అద్భుతాన్ని తామెక్కడా చూడలేదని, ఇదొక ‘వరల్డ్ వండర్’ అంటూ మహారాష్ట్ర నేతలు కొనియాడారు. ఇప్పటికే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మహారాష్ట్ర ప్రజలు తమ గ్రామాల్లో కూడా కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు మహారాష్ట్ర గ్రామ గ్రామానికి చేరుకున్నాయని మహారాష్ట్ర నేతలు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు తెలిపారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర నేతలు మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు, చూపిస్తున్న అభివృద్ధి. దార్శనికత మహారాష్ట్ర ప్రజల్లో చైతన్యం కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు, పంట సాయం అందించి వ్యవసాయానికి ఆసరాగా నిలుస్తున్నప్పుడు, తెలంగాణలో దళిత బంధు, సాగునీరు, ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అమలు చేస్తున్నప్పుడు., మీరెందుకు చేయట్లేరని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు, ప్రజలు, నాయకులు ప్రశ్నిస్తున్నారన్నారు. బిఆర్ఎస్ విధానాల ద్వారా సిఎం కేసీఆర్ ప్రసంగాల ద్వారా మహారాష్ట్ర ప్రజలు రోజు రోజుకూ వారెంతగానో చైతన్యం అవతున్నారన్నారు. కరెంట్ విషయంలో సీఎం కేసీఆర్ నినాదాలు, ప్రకటనలతో మహారాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని, ఈమేరకు కరెంట్ కోతలు తగ్గుముఖం పట్టే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని మహారాష్ట్ర నేతలు తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన వారిలో మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నాసాహెబ్ మానే, ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి, మహారాష్ట్ర నేత ఖదీర్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News