Sunday, October 6, 2024
Homeనేషనల్BRS: కవితకు ప్రమోషన్, బీఆర్ఎస్ నేషనల్ సెక్రెటరీ ఆమేనా ?

BRS: కవితకు ప్రమోషన్, బీఆర్ఎస్ నేషనల్ సెక్రెటరీ ఆమేనా ?

సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రమోషన్ దక్కటం నిశ్చయమైంనట్టు లీకులు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేషనల్ సెక్రటరీగా కవితను నియమిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రముఖంగా వినిపిస్తున్న కవిత పేరు నేపథ్యంలో ఆమెకు ఈ పదోన్నతి లభిస్తున్నట్టు రాజకీయ పండితులు, జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ జాతీయ వ్యవహారాల్లో ఆమె చాలా కీలకం వ్యవహరిస్తున్నారు. పార్టీ జాతీయ వ్యవహారాలను సమన్వయం చేసుకుంటూనే మహారాష్ట్ర, ఒడిస్సా పార్టీ వ్యవహారాల బాధ్యతను ఆమె తీసుకున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ ఆమె తెలంగాణ నుంచి పోటీ చేయటం ఖరారైనట్టు సమాచారం. దీంతో ఆమె తన బసను ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలతో పార్టీ వ్యవహారాలను సమన్వయం చేసుకునే బాధ్యతలు ఇస్తూ బీఆర్ఎస్ నేషనల్ జనరల్ సెక్రటరీ హోదాను ఆమెకు కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ప్రస్తుతానికి భారత రాష్ట్ర సమితి కేవలం తెలంగాణ సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల్లో మాత్రమే కాస్తో కూస్తో ప్రభావితం చూపేలా ఉన్నట్టు పరిస్థితులున్నాయి. కాగా ఏదో ఒక రాష్ట్రంలో ఒక్క సీటు గెలిచినా రాజకీయంగా జాతీయ స్థాయిలో తమ ఉనికిని చాటుకోవచ్చని బీఆర్ఎస్ భావిస్తోంది. అంతేకాదు ఇతర రాష్ట్రంలో ఒక్క సీటు బోణీ కొట్టినా.. ఓట్ షేర్ మెరుగ్గా వస్తే చాలని భారీ వ్యూహాలు రచిస్తూ.. 2024 లోక్ సభ ఎన్నికలను మాత్రమే టార్గెట్ గా పెట్టుకుంది. ఈ ఏడాది ఇతర రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బీఆర్ఎస్ పెద్దగా ఖాతరు చేసే ఆలోచనలో లేకపోవటానికి ఇదే కారణం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అసంతృప్తులపై ఇప్పటికే పట్టు బిగుస్తున్న బీఆర్ఎస్.. ఒరిస్సాలోని కాంగ్రెస్ అసంతృప్తులపై బాగానే వర్కౌట్ చేస్తోంది.

హిందీ, ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలిగే కవితకు ఇదంతా కొట్టిన పిండి అని ఆమె గురించి తెలిసివారంతా కచ్ఛితంగా అనే మాట. మంచి మాటకారి, డిప్లమాట్ గా కూడా కవితకు మంచి పేరుంది. పైగా మీడియాతో సన్నిహిత సంబంధాలు నెరిపే చాకచక్యం కూడా ఆమెకు మెండుగా ఉంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ ఫుల్ టైం జాతీయ రాజకీయాలకు కవిత సమర్థ నాయకురాలనే ఆలోచనలో పార్టీ ఉంది. అన్ని అర్హతలు ఉన్న కవిత గతంలో పార్లమెంట్ సభ్యురాలిగా తనకంటూ ఓ సర్కిల్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అఖిలేష్ యాదవ్, రాకేష్ టికాయట్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, హేమంత్ సోరెన్, పినరయి విజయన్, భగవంత్ మాన్, కేజ్రీవాల్ వంటివారితో కేసీఆర్ భేటీలు జరిపినప్పుడు కూడా ఆమె ఉన్నారు. నాందేడ్ సభలోనూ ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వెలగటం వెనుక ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ జాతీయ కార్యక్రమాల్లో ఆమె తప్పనిసరిగా తండ్రి వెంట మొదటి నుంచీ ఉంటూ వస్తున్నారుకూడా. ఈమధ్యనే శరత్ కుమార్ ను కలిసి ఈరోజు అర్జున్ సర్జాను కలిసిన కవిత వివిధ వర్గాలకు చెందిన సెలబ్రిటీలతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News