తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మహారాష్ట్ర ప్రజలది విడదీయ లేని ఆత్మీయ బంధమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం జరగనున్న బీఆర్ ఎస్ కాందార్ లోహ సభ విజయవంతాన్ని కాంక్షిస్తూ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ మోడల్ ను వివరించే కరపత్రాలను జీవన్ రెడ్డి కాందార్ లోహ తాలూకాలోని లాట్కూర్ అలెగావు ఖండి,భమ్ని,మంగళ్ సాంఘ్లీ,నందన్ వన్,ఔరాల్, చిక్లీ గ్రామస్తులకు పంచి కేసీఆర్ గారి సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని అహ్వానించారు.
మహారాష్ట్ర లోని కందార్ లోహ నియోజకవర్గ పరిధిలోని చిక్లి గ్రామంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా పలు గ్రామాలలో ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజలంటే కేసీఆర్ గారికి ప్రాణమని, అందుకే బీఆర్ ఎస్ సభలకు ఈ రాష్ట్రం నుంచే శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
కాందార్ లోహ సభ బీజేపీకి వణుకు పుట్టించేలా జరుగుతుందని, తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ మోడల్ హిందూస్తాన్ కు అంకితం చేస్తామని, మోడీ గోల్ మాల్ మోడల్ కు మంగళం పాడుతామని, బీజేపీ జూటా మాటలకు చరమ గీతం పలుకుతామని జీవన్ రెడ్డి అన్నారు.