Wednesday, February 18, 2026
HomeTop StoriesBudget 2026: బయోఫార్మా రంగానికి బూస్ట్.. రూ. 10 వేల కోట్లు కేటాయించిన నిర్మలమ్మ.!

Budget 2026: బయోఫార్మా రంగానికి బూస్ట్.. రూ. 10 వేల కోట్లు కేటాయించిన నిర్మలమ్మ.!

BioPharma : కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా దేశీయ వైద్య , ఆరోగ్య రంగాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ఊరటనిచ్చారు. భారతదేశాన్ని గ్లోబల్ బయోఫార్మా హబ్‌గా మార్చే లక్ష్యంతో, బయోఫార్మా మ్యాన్యుఫ్యాక్చరింగ్ కోసం ఏకంగా రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు లోక్‌సభలో ప్రకటించారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ, తమ ప్రభుత్వం సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతోందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

- Advertisement -

బయోఫార్మా రంగంలో విప్లవాత్మక మార్పులు

  • భారీ పెట్టుబడి: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా భారత్ తన సొంత తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం గుర్తించింది. ఇందులో భాగంగా..రానున్న ఐదేళ్ల కాలంలో బయోఫార్మా మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌ల ఏర్పాటు , అభివృద్ధి కోసం రూ. 10 వేల కోట్లను వెచ్చించనున్నారు.
  • ఉపాధి కల్పన: ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల సంఖ్యలో నిపుణులైన యువతకు ఉపాధి లభించడమే కాకుండా, పరిశోధన (R&D) రంగంలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది.
  • ఆత్మనిర్భర్ భారత్: మందుల తయారీకి అవసరమైన ముడి పదార్థాల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా, స్వదేశీ పరిజ్ఞానంతోనే మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను బలోపేతం చేయనున్నారు.
సంస్కరణల ఎక్స్‌ప్రెస్ – నిర్మలమ్మ ప్రసంగం

పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని చెప్పారు. “మా ప్రభుత్వం సంస్కరణల ఎక్స్‌ప్రెస్ మాదిరిగా ముందుకు సాగుతోంది” అని ఆమె అభివర్ణించారు. సామాన్యుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరినీ కలుపుకుంటూ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.

ఆరోగ్య భారత్ – మౌలిక వసతులు

కేవలం బయోఫార్మా మాత్రమే కాకుండా, మొత్తం ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చారు. మెడికల్ టూరిజంను ప్రోత్సహించడం, అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి రాయితీలు కల్పించడం వంటి చర్యల ద్వారా భారత్ త్వరలోనే ప్రపంచానికి మెడికల్ హబ్‌గా మారబోతోంది.

GST Collections: జనవరిలో GST సునామీ.. రూ.1.93 లక్షల కోట్లతో కొత్త రికార్డు.!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News