Tuesday, February 17, 2026
Homeనేషనల్Budget 2026 Highlights: : బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే..!

Budget 2026 Highlights: : బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే..!

Employment : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టారు. 2025లో తాము ప్రారంభించిన 350కి పైగా సంస్కరణల కొనసాగింపుగా, ఈ ఏడాది బడ్జెట్ ప్రధానంగా ‘ఉపాధి కల్పన , ఆర్థిక వృద్ధి’ లక్ష్యంగా రూపొందించబడింది. దేశాన్ని పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపేందుకు పలు కీలక రంగాలకు భారీగా నిధులను కేటాయించారు.

- Advertisement -
ఫార్మా , విద్యా రంగాలకు పెద్దపీట
  • బయో ఫార్మా శక్తి పథకం: దేశీయ వైద్య తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ‘బయో ఫార్మా శక్తి’ పథకాన్ని ప్రకటించింది. రానున్న ఐదేళ్ల కాలంలో ఈ పథకం కోసం రూ. 10 వేల కోట్లు వెచ్చించనున్నారు. దీనివల్ల మందుల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించనుంది.
  • కొత్త విద్యా సంస్థలు: ఫార్మా రంగంలో ఉన్నత స్థాయి విద్య , పరిశోధనల (Research) కోసం జాతీయ స్థాయిలో మూడు కొత్త విద్యా సంస్థలను స్థాపించబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవి ఫార్మా రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
టెక్నాలజీ , టెక్స్‌టైల్స్ రంగాల్లో విప్లవం
  • సెమీకండక్టర్ మిషన్: భవిష్యత్తు అవసరాలైన ఎలక్ట్రానిక్స్ , దుస్తుల తయారీ రంగాలకు బడ్జెట్‌లో భారీ ఊతం లభించింది. డిజిటల్ విప్లవంలో భాగంగా సెమీకండక్టర్ల తయారీకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఈ మిషన్ కోసం ఏకంగా రూ. 40 వేల కోట్లు కేటాయించారు. దీనివల్ల భారత్ గ్లోబల్ చిప్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే అవకాశం ఉంది.
  • మెగా టెక్స్‌టైల్స్ పార్కులు: ప్రపంచస్థాయి జౌళి ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించిన ప్రభుత్వం, మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనుంది.
  • గ్రామ స్వరాజ్ ఇనీషియేటివ్: ఖాదీ , చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ‘మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్ ఇనీషియేటివ్’ను ప్రారంభించనున్నారు.
మౌలిక సదుపాయాలు , ఎంఎస్‌ఎంఈలు
  • పెరిగిన కేటాయింపులు: దేశాభివృద్ధికి వెన్నెముక వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం తన పెట్టుబడులను మరింత పెంచింది. మౌలిక సదుపాయాల కల్పన (Capex) కోసం ఈసారి రూ. 12.2 లక్షల కోట్లు కేటాయించారు. గత ఏడాది ఇది రూ. 11.1 లక్షల కోట్లుగా ఉండేది.
  • ఛాంపియన్ ఎంఎస్‌ఎంఈలు: చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. వీటిని గ్లోబల్ ఛాంపియన్లుగా మార్చడమే లక్ష్యంగా ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.
  • రియల్ ఎస్టేట్: రియల్ ఎస్టేట్ ఆస్తుల రీసైకిలింగ్ , పునర్వినియోగం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్మలమ్మ వెల్లడించారు.
ఉపాధి , సంస్కరణల పథం

గత ఏడాది 350కి పైగా సంస్కరణలను అమలు చేశామని గుర్తు చేసిన ఆర్థిక మంత్రి, ఈ బడ్జెట్ యువతకు ఉపాధి కల్పనపైనే ప్రధానంగా దృష్టి సారిస్తుందని చెప్పారు. సంస్కరణల వేగం తగ్గకుండా, ఆర్థిక వృద్ధి రేటును స్థిరంగా కొనసాగిస్తూనే సామాన్యులకు లబ్ధి చేకూర్చేలా ఈ ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.

Budget: బడ్జెట్ రోజు నిర్మలమ్మ కట్టే చీరల ప్రత్యేకత గురించి తెలుసా!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News