Wednesday, November 12, 2025
Homeనేషనల్Bharat Jodo Yatra: బుల్లెట్ బండెక్కిన రాహుల్‌.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్

Bharat Jodo Yatra: బుల్లెట్ బండెక్కిన రాహుల్‌.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతుంది. ఆదివారం మ‌ధ్య‌ప్ర‌దేశ్ జిల్లాలో యాత్ర కొన‌సాగింది. ఉద‌యం 6గంట‌ల‌కు ప్రారంభ‌మైన పాద‌యాత్ర‌లో భారీ సంఖ్య‌లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జన్మస్థలం అయిన డా.అంబేడ్కర్ నగర్​కు యాత్ర చేరుకుంది. సాయంత్రం ఇండోర్‌కు యాత్ర చేరుకుంటుంది. రాత్రి ఇండోర్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ గాంధీ పాల్గొని ప్ర‌సంగిస్తారు.

- Advertisement -

భార‌త్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుల్లెట్ బండి ఎక్కి ప్రయాణించారు. ఆయన బైక్​పై వెళ్తుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఆయన వెనకే పరిగెడుతూ వెళ్లారు. రాహుల్ బండి న‌డుపుతున్నంత‌సేపు ఆ ప్రాంత‌మంతా జై కాంగ్రెస్‌, జై సోనియా, జై రాహుల్ అనే నినాదాల‌తో మారుమోగిపోయింది. పాద‌యాత్ర‌లో రాహుల్ గాంధీ స్థానికుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad