Tuesday, March 4, 2025
Homeనేరాలు-ఘోరాలుBus Accident: బస్సుకు అడ్డంగా వచ్చిన బైకర్‌.. వీడియో వైరల్

Bus Accident: బస్సుకు అడ్డంగా వచ్చిన బైకర్‌.. వీడియో వైరల్

హైవేపై బస్సు వేగంగా వెళ్తోంది. ఇంతలో ఓ ద్విచక్రవాహనదారుడు నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ బస్సుకు అడ్డంగా వచ్చాడు. అంతే ఆ బైక్‌ను తప్పించబోయిన బస్సు(Bus Accident) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే.. నాందేడ్ జాతీయ రహదారిపై అహ్మదాబాద్ నుంచి లాతూర్(Latur) వైపు ఓ బస్సు వెళ్తోంది. ఇదే సమయంలో ఓ బైకర్‌ బస్సును క్రాస్‌ చేసి యూటర్న్‌ తీసుకోబోయాడు. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్‌ బైకర్‌ను గుద్దకుండా తప్పించబోయాడు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి డివైడర్‌కు అవతల రోడ్డున బోల్తా పడింది.

- Advertisement -

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌ వర్ష ఠాకూర్‌ ఘూగే ఆదేశించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News