Ambenali Ghat: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు అదుపుతప్పిన కారు లోయలో పడింది. ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు.
అంబెనాలి ఘాట్ వద్ద ప్రమాదం: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయ్‌గఢ్ జిల్లా పరిధిలోని పోలాద్‌పూర్ – మహాబలేశ్వర్ ప్రధాన రహదారిపై ఉన్న అంబెనాలి ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులు కారులో దాపోలి నుంచి సతారాకు ప్రయాణిస్తుండగా.. ఘాట్ రోడ్డులోని ఒక మలుపు వద్ద వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
Also read-Alchippa: ఆల్చిప్పలు ఏరేందుకు నదిలోకి దిగి.. కర్ణాటకలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
మృతులంతా సతారా వాసులే: మృతులంతా సతారా ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో సతారాలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

