Saturday, November 15, 2025
Homeనేషనల్Beware Pet Lovers: పెంపుడు పిల్లులతో గర్భస్రావాలు! 'టాక్సోప్లాస్మోసిస్' ఇన్ఫెక్షన్‌పై నిపుణుల హెచ్చరిక!

Beware Pet Lovers: పెంపుడు పిల్లులతో గర్భస్రావాలు! ‘టాక్సోప్లాస్మోసిస్’ ఇన్ఫెక్షన్‌పై నిపుణుల హెచ్చరిక!

Toxoplasmosis infection from cats : ఇంట్లో పిల్లి ఉంటే ఆ సందడే వేరు.. వాటి అల్లరి, ముద్దు ముద్దు చేష్టలు ఒత్తిడిని దూరం చేస్తాయి. కానీ, ఆ ముద్దుల వెనుక ఓ ప్రమాదం దాగి ఉందని మీకు తెలుసా..? ముఖ్యంగా, గర్భిణులు పెంపుడు పిల్లుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేదంటే గర్భస్రావాలు జరిగే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అసలు పిల్లుల వల్ల గర్భిణులకు వచ్చే ఆ ముప్పేంటి? ‘టాక్సోప్లాస్మోసిస్’ అనే ఈ కొత్త ఇన్ఫెక్షన్ కథేంటి..?

- Advertisement -

సోషల్ మీడియా ప్రభావంతో, ఇటీవలి కాలంలో పిల్లులను పెంచుకునే ట్రెండ్ బాగా పెరిగింది. అయితే, వాటి నిర్వహణలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో గత 3 నెలల్లోనే సుమారు 1,864 మంది పిల్లుల దాడుల్లో గాయపడ్డారు, వీరిలో సగానికి పైగా మహిళలే.

ఏమిటీ ‘టాక్సోప్లాస్మోసిస్’ : ఇది ‘టాక్సోప్లాస్మా గోండి’ అనే పరాన్నజీవి (Parasite) వల్ల కలిగే ఓ రకమైన ఇన్ఫెక్షన్.
ఎలా వ్యాపిస్తుంది?: ఈ పరాన్నజీవి ప్రధానంగా పిల్లుల మలంలో ఉంటుంది. ఆ మలం ద్వారా నీరు, ఆహారం, పరిసరాలు కలుషితం కావడం వల్ల, లేదా సరిగా ఉడకని మాంసం తినడం వల్ల ఇది మనుషులకు సోకుతుంది.

గర్భిణులపై ప్రభావం: గర్భిణులకు ఈ ఇన్ఫెక్షన్ సోకితే, అది వారి కడుపులోని బిడ్డకు కూడా ప్రబలే ప్రమాదం ఉంది. దీనివల్ల కొందరిలో గర్భస్రావాలు జరగవచ్చు. లేదా, పుట్టబోయే బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడవచ్చు.

పిల్లి మలం ద్వారా ఆహారం, నీరు కలుషితమైతే టాక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ ప్రబలుతుంది. గర్భిణులు దీనిబారిన పడితే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది.”
– డాక్టర్ ఎం. సలీమ్ ఖాన్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి, శ్రీనగర్

లక్షణాలేంటి : ఈ ఇన్ఫెక్షన్ సోకిన గర్భిణులలో తలనొప్పి, తేలికపాటి జ్వరం, చర్మంపై దద్దుర్లు, మానసిక ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిపుణుల సూచనలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : పిల్లులను పెంచుకోవడం తప్పు కాదు, కానీ వాటి నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
గర్భిణులు దూరం: గర్భిణులు, పిల్లుల మలమూత్రాలను, అవి ఉండే బాక్సులను శుభ్రం చేసే పనులు అస్సలు చేయకూడదు.
గ్లౌజులు, మాస్కులు: తప్పనిసరి పరిస్థితుల్లో, మహిళలు చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధరించి మాత్రమే ఈ పనులు చేయాలి. ఆ తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
వ్యాక్సిన్లు: పిల్లులకు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్లు, నులిపురుగుల నివారణ మందులు వేయించాలి.
శుభ్రత: పిల్లులు ఉండే ప్రదేశాలను, వాటి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి.

పిల్లి కరిచినా, గోళ్లతో గీరినా అది హానికరమే. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పెంపుడు జంతువుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, ఆరోగ్య సమస్యలు తప్పవు.”

– డాక్టర్ సయ్యద్ అల్తాఫ్ గిలానీ, మెడికల్ సూపరింటెండెంట్, సెంట్రల్ వెటర్నరీ హాస్పిటల్, శ్రీనగర్


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad