Saturday, November 15, 2025
Homeనేషనల్CBSE Scholarship: సింగిల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌కు సీబీఎస్‌ఈ దరఖాస్తుల ఆహ్వానం.. వీరు మాత్రమే అర్హులు..!

CBSE Scholarship: సింగిల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌కు సీబీఎస్‌ఈ దరఖాస్తుల ఆహ్వానం.. వీరు మాత్రమే అర్హులు..!

CBSE Scholarship: పదో తరగతి పూర్తయిన బాలికలకు సీబీఎస్‌ఈ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రతిభ గల ఆడపిల్లలను గుర్తించి వారిని ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో స్కాలర్‌షిప్‌ అందిస్తామని తెలిపింది. అయితే, ఈ మెరిటోరిస్‌ స్కాలర్‌షిప్‌ అందరికీ వర్తించదని, కేవలం తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లలు మాత్రమే దరఖాస్తుకు అర్హులని స్పష్టం చేసింది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ప్రతినెలా రూ. 1000 అందజేస్తామని పేర్కొంది. ఈ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌లో భాగంగా 2025 సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసై ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం అక్టోబర్‌ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, గతేడాది ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులు రెన్యువల్‌ చేసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తులు, రెన్యువల్‌ కోసం సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌ www.cbse.gov.in క్లిక్ చేయండి.

- Advertisement -

స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు అర్హతలు..

1. పదో తరగతి పరీక్షల్లో కనీసం 70 శాతం, ఆపైన మార్కులు సాధించిన వారే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
2. దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల్లో 11, 12వ తరగతులు అభ్యసిస్తుండాలి.
3. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. విద్యార్థినికి చెందిన ఖాతాలోనే ఈ మొత్తాన్ని జమ చేస్తారు.
4. విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు పదో తరగతిలో నెలకు రూ.2500; సీబీఎస్‌ఈ 11, 12 తరగతులకు రూ.3వేలు మించరాదు.
5. సీబీఎస్‌ఈ బోర్డులో విద్యనభ్యసిస్తున్న ఎన్నారై విద్యార్థినులూ ఈ అవార్డుకు అర్హులే. వీరి ట్యూషన్ ఫీజు నెలకు రూ.6వేలు మించకూడద్దు.
6. ఈ స్కాలర్‌షిప్‌నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
7. 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్‌ చేయించుకోవాలంటే సదరు విద్యార్థినులు కనీసం 70శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది.
8. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉండాలి.
9. ఈ దరఖాస్తుల్ని సంబంధిత పాఠశాలలు అక్టోబర్‌ 30 నాటికి వెరిఫికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ప్రతినెలా రూ. 1000 స్కాలర్షిప్

ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి నెలా రూ.1000ల చొప్పున రెండేళ్ల వరకు అంటే ఇంటర్మీడియల్‌ పూర్తయ్యేంత వరకు అందజేస్తారు. దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు తప్పనిసరిగా సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11, 12వ తరగతులు చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షల్లో కనీసం ఐదు సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ స్కాలర్‌షిప్‌కు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్‌ చేయించుకునే వారు కనీసం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు 11వ తరగతిలో సాధించాలి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad