కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పెంచిన సంగతి తెలిసిందే. లీటర్‌కి రూ. 2 పెంచినట్లు(Petrol Price Hike) ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 8, 2025 నుండి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ పెంపు వల్ల పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటరుకు రూ. 13, డీజిల్‌పై రూ. 10 పెంచినట్లు తెలిపింది. అయితే ఈ పెంపు వల్ల సామాన్యుడిపై ఎలాంటి భారం ఉండదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెంచిన ధరలు కంపెనీలే భరిస్తాయని చెప్పింది.
మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ ఎక్సైజ్ సుంకం పెంచడాన్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా విమర్శించారు. మే 2014 నుంచి ముడి చమురు ధరలు 41 శాతం తగ్గాయని.. అయినప్పటికీ ప్రజలకు ప్రయోజనాలను అందించడం లేదని ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.