పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వంట గ్యాస్ సిలిండర్ ధరలను కూడా పెంచింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(LPG cylinder) ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహాయ వాయువుల శాఖమంత్రి హర్దీప్‌సింగ్ పురీ తెలిపారు. ఈ ధరల పెంపు ఉజ్వల పథకం, జనరల్ కేటగిరీ వినియోగదారులకు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించారు. ధరల పెంపుతో సాధారణ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.803 నుంచి రూ.853కి పెరగగా.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.503 నుంచి రూ.553కి చేరనుంది.