Thursday, April 3, 2025
Homeనేషనల్Waqf Bill: వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

Waqf Bill: వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

ప్రతిష్టాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు-2025’’((Waqf Amendment Bill))ని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్షాల నిరసనల నడుమ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై దాదాపు 8 గంటల పాటు చర్చించనున్నారు. అనంతరం ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

- Advertisement -

సభలో ఎన్డీయేకు మెజార్టీ ఉండటంతో బిల్లు సునాయాసంగా ఆమోదం పొందనుంది. లోక్‌సభలో బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజుల పాటు ఎంపీలందరూ తప్పకుండా పార్లమెంట్‌కు హాజరుకావాలని ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News