Friday, February 21, 2025
Homeనేషనల్Sheesh Mahal: 'శీష్ మహల్' ఆరోపణలపై విచారణకు కేంద్రం ఆదేశాలు

Sheesh Mahal: ‘శీష్ మహల్’ ఆరోపణలపై విచారణకు కేంద్రం ఆదేశాలు

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నివాసమున్న ‘శీష్ మహల్'(Sheesh Mahal) అవినీతి ఆరోపణపై విచారణకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా పునరుద్ధరణకు ఆప్‌ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై సమగ్ర నివేదిక అందించాలని కేంద్ర ప్రజాపనుల విభాగం (CPWD)ని ఆదేశించింది. కాగా ఈ బంగ్లాకు పక్కనున్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి విలాసవంతమైన శీష్‌మహల్‌ను విస్తరించారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. ఆ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాకు లేఖ రాశారు.

- Advertisement -

కాగా ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌ స్టాఫ్‌ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను కేజ్రీవాల్‌ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించారు. శీష్ మహల్‌లో రూ.96 లక్షల విలువైన మెయిన్ షీర్ కర్టెన్లు, రూ.39 లక్షల విలువైన కిచెన్ ఎక్విప్​మెంట్, రూ.4.80 లక్షల విలువైన మినీబార్, రూ.16.27 లక్షల విలువైన సిల్క్ కార్పెట్లు కనిపించాయి. దీంతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ విలాసాలు అనుభిస్తున్నారనే ఆరోపణలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ అవినీతి ఆరోపణలు ఎన్నికల్లో ఆప్‌ను ఘోరంగా దెబ్బతీసింది. అయితే ఇప్పుడు ఆ బంగ్లాలో ఢిల్లీ కాబోయే సీఎం నివాసం ఉండరని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News