Friday, November 22, 2024
Homeనేషనల్Rahul Gandhi: రాహుల్ యాత్రలో కోవిడ్ రూల్స్ పాటించాలన్న కేంద్రం.. మోదీ సంగతి ఏంటని ప్రశ్నించిన...

Rahul Gandhi: రాహుల్ యాత్రలో కోవిడ్ రూల్స్ పాటించాలన్న కేంద్రం.. మోదీ సంగతి ఏంటని ప్రశ్నించిన కాంగ్రెస్

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని సూచించింది కేంద్రం. అలా కుదరని పక్షంలో అవసరమైతే యాత్ర వాయిదా వేసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ రాహుల్ గాంధీకి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు లేఖ రాశారు.

- Advertisement -

ఈ లేఖలో పలు అంశాలు పేర్కొన్నారు. యాత్రలో మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, శానిటైజర్ వాడటం వంటివి చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్ చేయించుకున్నవాళ్లు మాత్రమే యాత్రలో పాల్గొనేలా చూడాలని ఆదేశించింది. అలా కుదరని పక్షంలో దేశ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే యాత్ర వాయిదా వేసుకోవాలని సూచించింది. అయితే, కేంద్రం చేసిన ఈ సూచనపై కాంగ్రెస్ మండిపడతోంది.

కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురి, మరో ఎంపీ కార్తీ చిదంబరం బీజేపీపై విమర్శలు చేశారు. ఇతర పబ్లిక్ ప్లేసుల్లో, సమావేశాల్లో ఏ ప్రొటోకాల్ రూల్స్ అమలవుతున్నాయని ప్రశ్నించారు. ఉన్నట్లుండి కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విషయంలోనే ప్రొటోకాల్ రూల్స్ గుర్తొచ్చాయా అని విమర్శించారు. ‘‘గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ చేపట్టిన ర్యాలీలు, సభల్లో కోవిడ్ ప్రొటోకాల్ ఫాలో అయ్యారా? రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు వస్తున్న స్పందన చూడలేకే కేంద్ర మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు” అని అధిర్ రంజన్ చౌధురి విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News