Falta constituency: కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో నియోజకవర్గంలోని మొత్తం 285 పోలింగ్ స్టేషన్లలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
రీ పోలింగ్ నిర్వహించనున్న ఈసీ: ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌ను రద్దు చేసిన ఈసీ.. తిరిగి రీ పోలింగ్‌ను ఈ నెల(మే) 21న నిర్వహించనున్నట్లు తెలిపింది. మే 21 ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పేర్కొంది. ఓట్ల లెక్కింపు మే 24 న చెపట్టనున్నట్లుగా ఈసీ వెల్లడించింది.
Also Read-West Bengal: నిన్నటి వరకు ఆమె పని మనిషి.. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే!
రీ పోలింగ్‌కు గల కారణాలు: ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్ సందర్భంగా ఫాల్తాలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఈసీ నిర్ధారించింది. ముఖ్యంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి అప్రజాస్వామిక చర్యలు జరిగినట్లుగా గుర్తించామని ఈసీ పేర్కొంది. పలు కేంద్రాల్లో యధేచ్ఛగా రిగ్గింగ్‌కు సైతం పాల్పడినట్లు తేలిందని తెలిపింది. పోలింగ్ సరళి నిష్పాక్షికంగా జరగకపోవడంతోనే మే 21న రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. దీంతో మే 21న జరిగే ఈ ఎన్నికపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

