Monday, April 28, 2025
Homeనేషనల్BBC News: పహల్గామ్ దాడిపై బీబీసీ తప్పుడు కథనం.. కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం

BBC News: పహల్గామ్ దాడిపై బీబీసీ తప్పుడు కథనం.. కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం

పహల్గామ్ ఉగ్ర దాడిపై కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్‌కు వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇప్పటికే ది న్యూయార్క్ టైమ్స్ ఉగ్రదాడిని మిలిటెంట్‌ దాడిగా తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తాజాగా బీబీసీ(BBC News) కూడా ఈ జాబితాలో చేరింది. కాశ్మీర్‌లో జరిగిన దాడి తర్వాత పాకిస్థాన్ వీసాలను భారత్‌ రద్దు చేసింది అనే శీర్షికతో కథనం ప్రచురించింది. ఈ కథనంలో పహల్గామ్ దాడిని మిలిటెంట్ దాడిగా పేర్కొంది.

- Advertisement -

ఈ కథనంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పహల్గాం దాడిపై బీబీసీ కవరేజీపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఆ సంస్థ హెడ్ జాకీ మార్టిన్‌కు లేఖ రాసింది. వాస్తవాలు తెలుసుకుని కథనాలు ప్రచురించాలని కోరింది. అంతేకాకుండా ఇక నుంచి ఈ దాడిపై బీబీసీ కవరేజీని నిత్యం పర్యవేక్షిస్తామని లేఖలో స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News