ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించింది. 8వ వేతన సంఘం(8th Pay Commission) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి. త్వరలో కొత్త కమిషన్‌కు చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు.
ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీస వేతనాల్లో 186 శాతం పెరగవచ్చని గతంలో నివేదికలు సూచించాయి. అయితే 2026 నాటికి సమర్పించే 8వ వేతన సంఘం నివేదిక తర్వాతే కచ్చితమైన వేతనం ఎంతమేర పెరగనుందో తెలియనుంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు వేతన సంఘం సిఫార్సుల మేరకు పెరగనున్నాయి.
మరోవైపు శ్రీహరికోటలోని షార్‌లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కూడా ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలోని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్‌జీఎల్‌వీ(NGLV) ప్రయోగాలకు అనుగుణంగా రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్‌ను నిర్మించనున్నారు. NGLV ద్వారా భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.