Cough Syrup below 2 years: సాధారణంగా చిన్నపిల్లలకు దగ్గు, జ్వరం వస్తే సిరప్‌లు తాగించడం సర్వసాధారణం. కానీ ఇకపై చిన్నారులకు దగ్గు తగిలితే సిరప్‌లు తాగించవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు కారణమేంటి.. ఇక్కడ తెలుసుకుందాం.
సెప్టెంబర్ 7 నుంచి 20 వ తేదీ మధ్య మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో 9 మంది చిన్నారులు కిడ్నీ ఫెయిలై మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడకూడదని.. రెండు నుంచి ఐదేళ్ల వరకు పిల్లలకు మాత్రం అత్యవరమైతేనే పరిమితంగా దగ్గు మందు వాడలని సూచించింది. రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో కూడా ఇలాంటి మరణాలు సంభవించడంతో కేంద్రం పరిశోధనలు ప్రారంభించింది.
Also Read: https://teluguprabha.net/biggboss/top-comedian-is-likely-to-enter-bigg-boss-wild-card-entry/
మృతి చెందిన చిన్నారుల్లో ఐదుగురు కోల్డ్‌రెఫ్, మరొకరు నెక్స్‌ట్రో సిరప్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఈ సిరప్‌లపై DCGA అత్యవసర పరిశోధనలు ప్రారంభించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్, ది సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇతర ఏజెన్సీలు చింద్వారా జిల్లాలో పర్యటించి.. చనిపోయిన చిన్నారులు వాడిన దగ్గు మందు శాంపిళ్లను పరీక్షించారు. అయితే ఆ మందులు కలుషితం కాలేదని.. వాటిలో హానికరమైన డీఎథిలీన్ గ్లైకాల్, ఎథిలీన్ గ్లైకాల్ లాంటి కిడ్నీలకు హానీ కలిగించే రసాయనాలు కూడా లేవని తేలింది.
Also Read: https://teluguprabha.net/national-news/bomb-threat-cm-stalin-trisha-residence-chennai-tamil-nadu/
అయినప్పటీకీ చిన్నారులకు దగ్గు మందును పరిమితంగా వాడాలని కేంద్రం సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దగ్గు మందు తీసుకోవడంపై అప్రమత్తమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. జలుబు, జ్వరంతో వచ్చే చిన్నపిల్లలకు సొంతంగా చికిత్స చేయకూడదని.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని వెల్లడించింది.


