Monday, December 23, 2024
Homeకెరీర్No detention policy: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

No detention policy: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆధ్వర్యంలోని పాఠశాలల్లో నో డిటెన్షన్‌ విధానాన్ని(No detention policy) రద్దు చేసింది. దీంతో వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుందని తెలిపింది. విద్యాహక్కు చట్టం- 2019కు చేసిన సవరణ ప్రకారం దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో డిటెన్షన్‌ విధానాన్ని తొలగించాయని పేర్కొంది. ఇందులో తెలుగు రాష్ట్రాలు లేవని చెప్పింది.

- Advertisement -

కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం పరీక్షల్లో విద్యార్థి విఫలమైతే.. రెండు నెలల్లోపే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఒకవేళ రీ-ఎగ్జామ్‌లోనూ ఫెయిల్‌ అయితే తిరిగి ఆయా తరగతుల్లోనే చదవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్‌ పాఠశాలలకు వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News