Friday, January 16, 2026
Homeనేషనల్PM Kisan: పీఎం కిసాన్‌పై బిగ్‌ అప్‌డేట్‌.. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఇలా చెక్...

PM Kisan: పీఎం కిసాన్‌పై బిగ్‌ అప్‌డేట్‌.. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

Check PM Kisan Beneficiary List: కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయం అందిస్తుంది. ఏటా మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తుంది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ 22వ విడతపై కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇటీవల గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. పీఎం కిసాన్ 22వ విడతను మార్చి, ఏప్రిల్ నెలల్లో ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌కు ఇటీవల ఓటీపీ ఆధారిత ఈకేవైసీని అందుబాటులోకి తెచ్చింది. పీఎం కిసాన్‌ సాయం పొందుతున్న రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఇకేవైసీ కోసం రైతులు అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కోసం తమ సమీపంలోని సీఎస్‌సీ సెంటర్లను సందర్శించాలి. మరిన్ని వివరాల కోసం రైతులు పీఎం కిసాన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా కిసాన్ ఈమిత్రా చాట్‌బాట్ నో యువర్ స్టేటస్ (KYS)లో తమ అర్హత స్టేటస్ చెక్ చేయవచ్చు. అయితే, మీరు పీఎం కిసాన్‌ పథకానికి అర్హులైతే.. మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.

- Advertisement -

లబ్దిదారుల లిస్టులో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి..

1. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ www.pmkisan.gov.inను ఓపెన్ చేయండి.
2. హోంపేజీలో “బెనిఫిషియరీ లిస్ట్‌’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
3. మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేరును ఎంటర్‌ చేయండి.
4. అన్ని వివరాలను ఎంటర్‌ చేసి ‘గెట్‌ రిపోర్ట్‌’ బటన్‌పై క్లిక్ చేయండి.
5. స్క్రీన్‌పై కనిపిస్తున్న లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు లేకపోతే?

1. ముందుగా పీఎం కిసాన్ పథకానికి ఇచ్చిన బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి.
2. మీ పేరుపై భూమి రికార్డులు స్పష్టంగా ఉండాలి.
3. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలి. అలాగే ఎన్పీసీఐ లింక్, డీబీటీ ఎనేబుల్ చేసుకోవాలి.
4. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి.

పీఎం కిసాన్ ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ ఎలా?

1. ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తి చేసేందుకు రైతులు ఆధార్‌తో లింక్ అయిన యాక్టివ్ మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి.
2. పీఎం కిసాన్ వెబ్ సైట్ www.pmkisan.gov.in లింక్‌పై క్లిక్ చేయండి.
3. హోంపేజీలో e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
4. మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి ఓటీపీని సబ్మిట్ చేయండి. దీంతో ఈ-కేవైసీ పూర్తి అవుతుంది.
5. ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తికాకపోతే సీఎస్సీ సెంటర్లలో బయోమెట్రిక్ ద్వారా కేవైసీ పూర్తి చేయవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News