2024 లో బీజేపీ గెలిచే అవకాశాలే లేవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చెన్నైలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. పారదర్శకత, నిబద్ధతతో పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ, 9 ఏళ్ల పాలనలో వాటిని అస్సలు పాటించ లేదన్నారు. అందుకే మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్నారు. గత పదేళ్లలో ప్రధానిగా మోడీ సాధించిందేంటని కవిత ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారి దేశవ్యాప్తంగా భావసారుప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తోంద న్నారు.
మోడీ కోరిక మేరకు తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు, ఐదుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల ఇండ్లకు సిబిఐ,ఈడీ వచ్చాయన్నారు కవిత. తాను ఏ తప్పు చేయలేదని, మెజారిటీ ప్రతిపక్ష నాయకులు సైతం ఎలాంటి తప్పు చేయలేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఎన్నికల ఉన్న రాష్ట్రాల్లో మోదీ వచ్చేముందు సిబిఐ, ఈడీ వస్తాయని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు.
Chennai: నేనే తప్పూ చేయలేదు, మోడీని సాగనంపే టైం వచ్చింది: కవిత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES