Sunday, October 6, 2024
Homeనేషనల్Chevella: తెలంగాణకు డబుల్ ఆర్ ఉన్నారన్న ప్రియాంక

Chevella: తెలంగాణకు డబుల్ ఆర్ ఉన్నారన్న ప్రియాంక

మోడీని నిలదీయండి

తాండూరులో ప్రియాంక గాంధీ బహిరంగ సభ విజయవంతంగా సాగింది. తాండూరుకు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందన్న ప్రియాంక, చిలుకూరు బాలాజీ ఉన్న పవిత్ర ప్రాంతం ఇది..నాకు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉందన్నారు. ఇందిరా గాంధీకి  మీరంతా ప్రేమను పంచారంటూ ప్రసంగం ప్రారంభించిన ఆమె.. నా తల్లి  సోనియా గాంధీని మీరు సోనియమ్మ అంటూ ప్రేమతో పిలిచి తల్లి పాత్ర ఇచ్చారని గుర్తుచేశారు.

- Advertisement -

తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాసేవకు పునరంకితం అయ్యే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. ప్రజల కోసం పని చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ప్రియాంక గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సిన శక్తిని ఇచ్చారన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నాలకు తెలంగాణ నుంచే అడ్డుకోవాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 500 వందలకే ఇస్తోంది…కానీ ఉత్తర ప్రదేశ్ లో 1200 రూపాయలకు ఇస్తున్నారన్నారు.

ధరల నియంత్రణను బీజేపీ ప్రభుత్వం చేయడం లేదని,  పదేళ్ల పాలనలో బీజేపీ ధనవంతుల కోసమే పనిచేసిందని, మహిళలు, వెనుకబడిన వర్గాలు, కార్మికులు ,పేదల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. సామాన్యులపై పన్నులు పెరుగుతున్నాయని, కానీ ధనవంతులపై పన్నులు మాత్రం పెరగవన్నారు. ధనికుల 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు..కాని రైతులకు ఏ మాత్రం సాయం అందలేదని, పంట నష్టపోయిన రైతులకు సహాయం అందడం లేదన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయన్నారు.

నోట్ల రద్దుతో  రైతులు, చిన్న వ్యాపారులు, సామాన్యుల నడ్డి విరిగిందని, బీజేపీ ఎన్ని అబద్ధాలు చెప్పాల్లో అన్ని చెప్పిందని ఇక ముందు ప్రజలు ఆ పార్టీకి సహకరించరన్నారు. పదేళ్లలో ఏం చేశారని మోదీ, బీజేపీ నేతలను నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతం సుభిక్షమైందని, ఈ ప్రాంతం కోసం ఎన్నో త్యాగాలు చేశారన్నారు.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన త్రిబుల్ ఆర్ సినిమా చూశారా..మనకు డబల్ఆర్ ఉన్నారు.. ఆర్ అంటే రేవంత్ రెడ్డి, మరో ఆర్ అంటే రాహుల్ గాంధీ …తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా  పనిచేస్తోందని ఆమె కితాబిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News