Chhattisgarh Train Accident: ఛత్తీస్‌గఢ్‌లో బిలాస్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం జరిగింది. వాస్తవానికి లోకల్ మెమూ ప్యాసింజర్ రైలు ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొనటంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ ఘటన కోర్బా జిల్లా గెవ్రా నుండి బిలాస్పూర్‌కు వెళ్లుతున్న పాసింజర్ రైలు ఒక ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టింది. ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారని తెలుస్తోంది.
ఘటనలో మృతుల్లో నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఒక వ్యక్తి స్థితి విషమంగా ఉంది. బిలాస్పూర్‌లోని అపోలో ఆసుపత్రి, ఛత్తీస్‌గఢ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సీఎంఎస్)లో గాయపడిన వారి చికిత్స జరుగుతోంది. రైల్వే సిబ్బంది, స్థానికులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు నిర్వహించారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వ్యక్తులకు రూ.50వేలు పరిహారం ప్రకటించారు. ఇదే క్రమంలో రైల్వే శాఖ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు మొత్తం రూ.10 లక్షల పరిహారం, తీవ్ర గాయపడినవారికి రూ.5 లక్షలు, సాధారణ గాయాలైన వారికి రూ.లక్ష పరిహారంగా ఇవ్వనున్నట్లు చెప్పింది. ప్రమాదానికి కారణమైన అంశాలపై రైల్వే సేఫ్టీ కమిషనర్ స్థాయిలో దర్యాప్తు జరుపుకుంటుంది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌లను ఉపయోగించలేదనే అంశంపై కూడా ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదం వల్ల దక్షిణ మధ్య రైల్వేృ జోన్ ప్రధాన కార్యాలయం ఉన్న బిలాస్పూర్ నగరానికి సమీపంలో రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత ప్రమాదంలో ప్రయాణికుల వివరాల కోసం ఎమర్జెన్సీ సంప్రదింపులకు నంబర్లను ప్రకటించింది రైల్వై శాఖ.
బిలాస్ పూర్ – 7777857335, 7869953330
చంపా – 8085956528
రాయ్ ఘడ్ – 9752485600
పెంద్రా రోడ్ – 8294730162
కోర్బా – 7869953330
ఉస్లాపూర్ – 7777857338


