Mother attacks Children in Maharashtra: కడుపున పుట్టిన పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోతుంది తల్లి. అమ్మా.. ఆకలేస్తుంది అని అడగకముందే వారి మనసు గ్రహించి వారికి నచ్చినవి వండి గోరుముద్దలు చేసి పెడుతుంది. కన్న ప్రాణం కోసం ఎంతదూరమైనా వెళ్తుంది అమ్మ.. కానీ ఇక్కడ మాత్రం తన పిల్లల పాలిట ఓ మాతృమూర్తి మాత్రం మృత్యుపాశంగా మారింది. అసలేం జరిగిందంటే..
Also Read: https://teluguprabha.net/national-news/karur-stampede-vijay-rally-power-cut-request-tvk-2025/
కాశీపాద ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో 40 ఏళ్ల పల్లవి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆదివారం కావడంతో చికెన్ కూర వండాలని పిల్లలు తల్లిని కోరారు. దీంతో ఆగ్రహించిన పల్లవి వంట గదిలో ఉన్న చపాతీ కర్రతో పిల్లలను దారుణంగా చితకబాదింది. ఏడేళ్ల కుమారుడు చిన్మయ్ గణేష్ దెబ్బలు తాళలేక అక్కడికక్కడే మరణించగా.. పదేళ్ల కుమార్తె తీవ్రంగా గాయాలపాలైంది.
ఈ హృదయ విదారక ఘటనలో పిల్లల అరుపులు విన్న ఇరుగుపొరుగు కడుపు తరుక్కుపోయింది. ఆ ఘోరాన్ని కళ్ల చూడలేక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని చూసి చలించిపోయారు. చిన్మయ్ గణేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కుమార్తెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లి పల్లవిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


