Mouth Buddies : చైనాలో ఒక విచిత్రమైన కొత్త డేటింగ్ ట్రెండ్ ప్రారంభమైంది. ఇందులో అపరిచితులు ఒకరికొకరు ముద్దులు ఇచ్చిపుచ్చుకుంటారు. దీన్ని వారు ‘మౌత్ బడ్డీస్’ అంటారు. స్థానిక మాండరిన్ బాషలో దీన్ని ‘జుయ్ యు’ అని పిలుస్తారు. ప్రజలు ఆన్‌లైన్ ద్వారా కలుసుకుని కిస్సింగ్ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. దీనిపై ప్రజలు రెండుగా విడిపోయారు. కొందరు దీనికి ఓటు వేస్తుంటే మరికొందరు కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఇది సరికాదని అంటున్నారు.
‘మౌత్ బడ్డీస్’ అంటే కేవలం ముద్దులు ఇవ్వడం మాత్రమే. ఇందులో శృంగారం గానీ, మరే ఇతర సంబంధం గాని ఉండదనే నిబంధనలు ఉన్నాయి. కిస్సింగ్ సెషన్స్ ముగిసిన తరువాత చాలా జంటలు మళ్లీ కలుసుకోవడం లేదని చెబుతున్నారు.
వాస్తవానికి ఒకరినొకరు ముద్దుపెట్టుకున్న కొందరు వ్యక్తులు నాకు తెలుసు, కానీ వారు ప్రేమికులుగా మారలేదు. కాబట్టి ముద్దు పెట్టుకోవడం సాధారణం, పెద్ద విషయం కాదు అని గ్వాన్ లీ అనే విశ్వవిద్యాలయ విద్యార్థిని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్ని ఎంజాయ్ చేయడం ముఖ్యం. పార్ట్నర్‌ను ముద్దు పెట్టుకుంటుంటే నేను ఎంతో ఇష్టపడే వ్యక్తిని ముద్దుపెట్టుకుంటున్నట్లుగా అనిపిస్తుందని ఆమె చెప్పింది. మరికొందరు దీనిపై మాట్లాడుతూ ముద్దులు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఫ్రీ అవుతామని, శృంగారంతో పోలిస్తే దీని వల్ల ఎటువంటి సమస్యలు ఉండవన్నారు.
జుయ్ యు ట్రెండ్‌ను ప్రయత్నించాలనుకునే వ్యక్తులకు జాంగ్ ఇంటిపేరుతో ఉన్న మహిళ ఓ సలహా ఇచ్చింది. బార్‌లు, సందులు, ఒక వ్యక్తి ఇంటి ప్రదేశాలలో ముద్దు పెట్టుకోవడానికి అంగీకరించవద్దని ఆమె మహిళలను హెచ్చరించింది. ముద్దు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇది ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో సహా మిలియన్ల కొద్దీ సూక్ష్మక్రిములను వ్యాపింపజేస్తుంది. కాబట్టి మీరు ముద్దు పెట్టుకునే ముందు మీ భాగస్వామని ఆరోగ్య రిపోర్టును ఓ సారి పరిశీలించండి అని జాంగ్ చెప్పారు.