Friday, November 22, 2024
Homeనేషనల్Covid-19: చైనా నుంచి గుజరాత్ వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్

Covid-19: చైనా నుంచి గుజరాత్ వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్

Covid-19: దేశంలో ఇటీవల నమోదవుతున్న కోవిడ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారికి కూడా ఎయిర్‌‌పోర్టుల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా చైనా వంటి కోవిడ్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండనున్నారు.

- Advertisement -

తాజాగా చైనా నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కోవిడ్ సోకినట్లు తేలింది. గుజరాత్‌లోని భావనగర్‌‌కు చెందిన ఒక 34 ఏళ్ల ఒక వ్యక్తి ఇటీవల వ్యాపార పనుల నిమిత్తం చైనా వెళ్లొచ్చాడు. అనంతరం అతడిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడి శాంపిల్‌ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం గాంధీనగర్ పంపారు. తమ రాష్ట్రంలో చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ సోకడంతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం చైనాలో కోవిడ్ విజృంభిస్తున నేపథ్యంలో అక్కడి వేరియెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే చైనాలో కోవిడ్ వేవ్‌కు కారణమైన ఒమిక్రాన్ బీఎఫ్.7 వైరస్ దేశంలో నలుగురికి సోకింది. వీటిలో రెండు కేసులు గుజరాత్‌లోనే నమోదయ్యాయి. మరోవైపు కేంద్రం కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. రాబోయే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కోవిడ్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News