Sunday, December 8, 2024
Homeనేషనల్Pop Singer Kris Wu: చైనీస్, కెన‌డియ‌న్ పాప్ సింగ‌ర్‌ క్రిస్ వూకు 13 ఏళ్ల...

Pop Singer Kris Wu: చైనీస్, కెన‌డియ‌న్ పాప్ సింగ‌ర్‌ క్రిస్ వూకు 13 ఏళ్ల జైలు శిక్ష

Pop Singer Kris Wu: 17 ఏళ్ల‌ బాలిక‌పై అత్యాచారం చేసిన కేసులో బీజింగ్‌లోని చావోయాంగ్ జిల్లాలోని కోర్టు శుక్ర‌వారం కీల‌క తీర్పును వెలువ‌రించింది. కేసులో నిందితుడిగాఉన్న చైనీస్, కెన‌డియ‌న్ పాప్ సింగ‌ర్‌ క్రిస్ వూకు 13 ఏళ్ల జైలు శిక్షను విధించింది. త‌న‌ను 17 ఏళ్లు ఉన్న‌ప్పుడు క్రిస్ డేట్‌కు వ‌చ్చాడ‌ని, ఆ స‌మ‌యంలోనే క్రిస్ త‌న‌పై అత్యాచారం చేశాడని 19ఏళ్ల‌ డి.మీజు ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. మ‌రో మ‌హిళ‌పై కూడా అత‌ను అత్యాచారం చేశాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదులో పేర్కొంది.

- Advertisement -

డి. మీజు ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఈ ఏడాది జూలైలో క్రిస్‌ను అరెస్టు చేశారు. క్రిస్ త‌న‌ నేరం ఒప్పుకోవ‌డంతో కోర్టు అత‌నికి జైలు శిక్ష విధించింది. అత్యాచారం చేసినందుకు క్రిస్‌కు 11 ఏళ్ల 6 నెల‌లు జైలు శిక్ష ప‌డింది. మ‌రికొంత‌మందిని లైంగిక చ‌ర్య‌ల‌కు ప్రోత్స‌హిస్తున్న‌ కేసులో కోర్టు అత‌నికి 22 నెల‌లు జైలు శిక్ష విధించింది. మొత్తం క్రిస్‌ 13 ఏళ్లు జైలులో ఉండ‌నున్నాడు.

క్రిస్‌పై అత్యాచారం ఆరోప‌ణ‌లు రావ‌డంతో పోర్షే, లూయిస్ వోట‌న్ వంటి ప్ర‌ముఖ బ్రాండ్‌లు అత‌డితో ఒప్పందం ర‌ద్దు చేసుకున్నాయి.చైనాకు చెందిన క్రిస్ ప్ర‌స్తుతం కెనడాలో నివ‌సిస్తున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News