Saturday, November 15, 2025
Homeనేషనల్Operation Mahadev: పహల్గాం ఉగ్రవాదులను పట్టించిన చైనా ఫోన్‌!

Operation Mahadev: పహల్గాం ఉగ్రవాదులను పట్టించిన చైనా ఫోన్‌!

Pahalgam Attack: పహల్గాం ఉగ్ర దాడికి బాధ్యులైన నలుగురు ఉగ్రవాదులను భారత బలగాలను తాజాగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ మహాదేవ్ పేరుతో ఈ ఆపరేషన్ జరిగింది. అయితే పహల్గాం దాడి తర్వాత పరారైన ఉగ్రవాదుల జాడను.. శత్రు దేశం ద్వారానే మన వాళ్లు కనుగొనడం గమనార్హం. పూర్తి వివరాలు కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం…

- Advertisement -

పహల్గాం ఉగ్రదాడులు డాచిగామ్‌లో ఉన్నట్లు తొలుత మే 22న ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు సమాచారం అందింది. దీంతో దాదాపు రెండు నెలలపాటు ఏజెన్సీలు అనేక మార్గాల్లో ఆ సమాచారాన్ని ధ్రువీకరించుకున్నాయి. ఇందుకోసం అత్యాధునిక సెన్సర్లను కూడా వాడారు. మహాదేవ్‌ పర్వతం వద్దే వారు ఉన్నట్లు జులై 22నే పక్కాగా నిర్ధరించుకున్నారు. అయితే ఈ ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాన్ని గుర్తించడంలో.. మన దేశానికి మరో శత్రువుగా వ్యవహరిస్తోన్న చైనీస్ శాటిలైట్ ఫోన్ సిగ్నల్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. చైనాకు చెందిన, నిషేధిత T-82 అల్ట్రాసెట్ శాటిలైట్ ఫోన్ ను ఉగ్రవాదులు ఉపయోగించారు. దాన్ని సిగ్నల్స్ అనుకోకుండా యాక్టివేట్ కావడంతో వారి ఆచూకీ బయటపడింది. అయితే ఈ ఫోన్ చైనాకు చెందిన హువావే నెట్‌వర్క్‌ ద్వారా పని చేస్తుంది.

అసలు విషయం ఏంటంటే ఉగ్రదాదులను పట్టించిన ఈ T-82 అల్ట్రాసెట్ శాటిలైట్ ఫోన్‌లను భారత్ 15 ఏళ్ల కిందటే నిషేధించింది. 2020 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత చైనీస్ టెలికాం సంస్థలైన హువాయ్, ZTE ఉత్పత్తులపై పూర్తి నిషేధం విధించింది. ఈ ఫోన్‌లు చైనాకు చెందిన టియాంటాంగ్-1 శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా రహస్య కమ్యూనికేషన్‌కోసం అనుసంధానం చేయబడ్డాయి. కానీ గత వారం చివర్లో ఈ ఫోన్ల సిగ్నల్స్ యాక్టివేట్ కావడంతో ఢిల్లీలోని యూనిట్లు ఈ సిగ్నల్‌ను గుర్తించాయి. దీంతో భారత బలగాలు వెంటనే చర్యలు ప్రారంభించాయి.

జులై 28న మన సైన్యం డ్రోన్‌లతో డచిగం అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. 9:30కు పర్వత ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 11:15కు ఒక ఉగ్రవాదిని హతమార్చారు. ఆ కొద్ది సేపటికే మరో ముగ్గుర్ని మట్టుబెట్టారు. మొత్తం ఆపరేషన్ 90 నిమిషాల్లో విజయవంతంగా పూర్తి అయింది. అంటే భారత బలగాలు శత్రువులను వేటాడటమే కాకుండా, వారి టెక్నాలజీని వారికే ఉచ్చుగా మార్చి మరీ హతమర్చారు. ఈ ఆపరేషన్‌లో అత్యుత్తమైన టెక్నాలజీ వినియోగం జరిగిందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad