వారం రోజుల క్రితం కేరళలోని వాయనాడులో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంత ఇంతా కాదు, ప్రతి ఒక్కరిని కలిచివేసింది. ఈ విపత్కర సమయంలో తమ వంతు బాధ్యతగా స్పందించి కోటి రూపాయలు CM రిలీఫ్ ఫండ్ కి విరాళాన్ని పద్మ విభూషణ్ మెగాస్టార్ డా. చిరంజీవి, గ్లోబల్ స్టార్ డా. రామ్ చరణ్ వెంటనే ప్రకటించి, కోటి రూపాయల చెక్ ను మెగాస్టార్ చిరంజీవి గారు కేరళకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు పినరాయి విజయన్ కి అందజేశారు.
