Homeనేషనల్Chitkara University: చిత్కారా యూనివర్సిటీలో ‘దెయ్యం’ వీడియో కలకలం.. ఇద్దరి అరెస్ట్

Chitkara University: చిత్కారా యూనివర్సిటీలో ‘దెయ్యం’ వీడియో కలకలం.. ఇద్దరి అరెస్ట్

పంజాబ్, అక్టోబర్ 3 (తెలుగు ప్రభ): పాటియాలా జిల్లాలోని చిత్కారా యూనివర్సిటీలో నిరసన ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సందేశాలను ప్రచారం చేయడంతో పాటు విద్యార్థులను రెచ్చగొట్టి భారీ నిరసనలకు కారణమయ్యారనే ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

‘దెయ్యం’ వీడియోతో మొదలైన కలకలం

సెప్టెంబర్ 25-26 మధ్య రాత్రి యూనివర్సిటీ క్యాంపస్‌లో ‘దెయ్యం’ కనిపించిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ కావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వీడియో విస్తృతంగా ప్రచారం కావడంతో వందలాది మంది విద్యార్థులు అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నంగల్‌కు చెందిన హిమాన్షు, అంబాలాకు చెందిన ఆర్యన్‌ వివిధ సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పుదోవ పట్టించే సందేశాలను ప్రచారం చేసి, విద్యార్థులను రెచ్చగొట్టినట్లు గుర్తించారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులకు వీరిద్దరూ కారణమయ్యారని పోలీసులు తెలిపారు. అలాగే, ఆందోళన సమయంలో విద్యార్థులు, ఇతర అనుమానిత వ్యక్తులు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు, షేర్ చేసిన సందేశాలను కూడా పోలీసులు పరిశీలించారు.

మరో 10 మందిపై ఎఫ్‌ఐఆర్

బనూర్ డీఎస్పీ సుఖ్‌దేవ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనకు సంబంధించి హిమాన్షు, ఆర్యన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో 10 మందిని ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొన్నట్లు చెప్పారు. వారిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను వివిధ ప్రాంతాలకు పంపినట్లు వెల్లడించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, విద్యార్థులను రెచ్చగొట్టడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలగించడం వంటి చర్యలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యూనివర్సిటీ పరిసరాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News