Saturday, November 15, 2025
Homeనేషనల్CJI BR Gavai: ‘మర్చిపోయిన అధ్యాయం’.. దాడికి యత్నం ఘటనపై స్పందించిన సీజేఐ

CJI BR Gavai: ‘మర్చిపోయిన అధ్యాయం’.. దాడికి యత్నం ఘటనపై స్పందించిన సీజేఐ

CJI BR Gavai: సుప్రీంకోర్టులో సోమవారం ఓ కేసులో వాదనలు జరుగుతుండగా సీజేఐ బీఆర్‌ గవాయ్‌పై రాకేష్ కిషోర్ అనే లాయర్‌ తన షూ విసిరిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ దాడిని ప్రధాని సైతం తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో తనపై జరిగిన దాడిపై తాజాగా సీజేఐ స్పందించారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/high-court-stay-on-bc-reservations/

ఆరోజు జరిగింది చూసి షాక్ అయిపోయానని.. ఆ ఘటనను ‘మర్చిపోయిన ఛాప్టర్‌’గా భావిస్తున్నట్లు సీజేఐ తెలిపారు. ”సోమవారం జరిగిన ఘటనతో నేను, నా సహచర జడ్జి షాక్‌ అయ్యాం. అయితే ఇది మాకు మర్చిపోయిన అధ్యాయం” అని సీజేఐ పేర్కొన్నారు. అయితే ఆ ఘటనను జోక్‌గా తీసుకోవద్దని జస్టిస్‌ ఉజ్జన్‌ భూయాల్‌ అన్నారు. సీజేఐపై దాడికి యత్నం ఘటన క్షమార్హం కాదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పష్టం చేశారు.   

Also Read: http://teluguprabha.net/telangana-news/bandi-sanjay-bjp-local-elections-telangana-unity-no-groups-2025/

కాగా, లాయర్‌ రాకేష్‌ కిషోర్‌(71)ను సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్ బహిష్కరించడంతో పాటు ఆయన భవిష్యత్తులో మళ్లీ కోర్టులో అడుగుపెట్టకుండా ఎంట్రీ కార్డును రద్దు చేశామని గురువారం అధికారికంగా ప్రకటించింది. ఘటన జరిగిన తర్వాత 3 గంటల విచారణ అనంతరం పోలీసులు లాయర్‌ను వదిలేయగా.. సుప్రీంకోర్టు బార్‌ అసోషియేషన్ ముందుగా రాకేష్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంతలోనే గురువారం అతడిని బహిష్కరిస్తున్నట్లు బార్‌ అసోషియేషన్ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad