Sunday, November 16, 2025
Homeనేషనల్Siddaramaia‌h: ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్యకు క్లీన్‌చిట్

Siddaramaia‌h: ముడా స్కాంలో సీఎం సిద్ధరామయ్యకు క్లీన్‌చిట్

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaia‌h)కు భారీ ఊరట లభించింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) కుంభకోణం(MUDA Scam) కుంభకోణంలో ఆయనకు లోకాయుక్త క్లీన్‌చిట్‌ ఇచ్చింది. సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని పేర్కొంది. కాగా ముడా స్కామ్‌ కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ స్కాంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందారనే ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు సామాజిక కార్యకర్తలు టి.జె.అబ్రహం, స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో కేసు నమోదైంది.

- Advertisement -

ఈక్రమంలోనే ఆయన సతీమణి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేశారు. ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని హైకోర్టులో సవాల్ చేయగా.. ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో లోకాయుక్త పోలీసులు ఈ స్కామ్‌పై విచారణ జరుపుతున్నారు. తాజాగా సిద్ధరామయ్య పాత్ర లేదంటూ క్లీన్‌చిట్ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad