కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)కు భారీ ఊరట దక్కింది. కొన్ని నెలలుగా ముడా హౌసింగ్ స్కామ్(MUDA Housing Scam) కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కాంలో సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ స్కాంలో విచారణ చేపట్టాలని కర్ణాటక హైకోర్టు లోకాయుక్త కమిటీని నియమించింది. అలాగే ఈ కమిటీ ముందు విచారణ కావాలని సిద్ధరామయ్యను ఆదేశించింది.
తాజాగా ఈ కేసు విచారణ జరుపుతున్న లోకాయుక్త కమిటీ సిద్ధరామయ్యకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తేల్చిందిత. ఈమేరకు తన నివేదికను హైకోర్టుకు సమర్పించనుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ నాయకుడి తప్పు లేదని తేలడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకాయుక్త కమిటీ నివేదిక బీజేపీకి చెంపపెట్టు అని విమర్శిస్తున్నారు.